రీఎంట్రీపై స్పందించిన ఏబీడి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2020 1:27 PM IST
రీఎంట్రీపై స్పందించిన ఏబీడి

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌.. తన రీ ఎంట్రీపై స్పందించాడు. ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఆడిన తర్వాతే.. తన పునరాగమనంపై నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు.

2018లో అనూహ్యంగా రిటైర్‌మెంట్‌ ప్రకటించిన డివిలియర్స్‌ ఇటీవలే తిరిగి జాతీయ జట్టు తరుపున ఆడేందుకు ఉత్సుకత ప్రదర్శించాడు. రిటైర్‌మెంట్‌ అనంతరం ఐపీఎల్‌ తరహా లీగుల్లో మాత్రమే ఆడుతున్నాడు. కాగా కరోనా వైరస్‌ ముప్పుతో మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఏప్రిల్‌ 15 వరకు వాయిదా వేశారు.

'ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతానికి నా దృష్టి అంతా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పై ఉంది. రాయర్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు తరుపున నా సర్వశక్తుల మేరకు పోరాడతా. తర్వాత ఈ ఏడాదిలో ఏంచేయాలనే దాని గురించి ఆలోచిస్తానని' చెప్పాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ గురించి తాను ఆలోచించడం లేదని, ప్రస్తుతం తన ధ్యాస అంతా ఐపీఎల్‌ గురించే ఉందని తెలిపాడు.

ప్రతి ప్లేయర్‌ తన పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజుల్లో ప్రముఖ ఆటగాళ్లకు మానసిక, శారీరక ఒత్తిడి భారీగా ఉంది. అయితే ఏం చేయాలో, ఏం చేయకూడదనేది వారే నిర్ణయించుకోవాలన్నాడు. ద‌క్షిణాఫ్రికా టీమ్‌లోకి ఏబీ డివిలియ‌ర్స్‌ పున‌రాగ‌మ‌నం చేయాల‌ని ఆ జ‌ట్టు ఫ్యాన్స్‌తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానులు కోరుకుంటున్నారు. అయితే పున‌రాగ‌మ‌నంపై ఏబీ వేచిచూసే ధోర‌ణిని అవ‌లంబిస్తున్నాడు.

Next Story