ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వినోద రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో సమావేశమయిన విషయం తెలిసిందే. మహాత్మా గాంధీ 150 వ జయంతి పురస్కరించుకుని సినీ, టీవీ రంగాలు ఇటీవల రూపొందించిన చేసిన నాలుగు సాంస్కృతిక వీడియోలను ఆయన విడుదల చేశారు. బాలీవుడ్‌ హీరోలు ఆమిర్ ఖాన్‌, షారుఖ్‌ఖాన్‌లు మోదీతో సమావేశమైన అనంతరం మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ప్రధాని మోదీ కార్యాలయం ట్విటర్‌ పోస్ట్‌ చేసింది. ‘ ప్రధాని మోదీతో సమావేశం అద్భతంగా ఉంది’ అని ఆమిర్ ఖాన్‌ అనగా.. ‘ అందర్నీ కలుసుకునేందుకు అద్భుతమైన అవకాశం’ అని షారుఖ్‌ తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.