ముఖ్యాంశాలు

  • ఆధార్‌లో బంధుత్వాలకు స్వస్తి
  • గుట్టు చప్పుడు కాకుండా కేంద్రం నిర్ణయం
  • ఆధార్‌ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు

ఢిల్లీ: ‘సన్నాఫ్‌కు స్వస్తి’ అంటూ ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి కథనం రాసింది. ఆధార్‌కార్డుల్లో బంధుత్వాలకు మంగళం పాడేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా కార్డు తీసుకున్నా, అప్‌డేట్‌ చేసుకున్నా ఆటోమేటిక్‌ డాటరఫ్‌, సన్నాఫ్‌ స్థానంలో కేరాఫ్‌గా మారిపోనుంది. అయితే దీనిపై కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా నిర్ణయం తీసుకుందని సమాచారం. ఎన్‌ఆర్‌సీ అమలులోకి వస్తే.. ఎవరి పౌరసత్వం వారు నిరూపించుకోవాల్సి వస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆధార్‌తో పాటు, పాస్‌పోర్టుల్లూనూ ఇదే మార్పు రానుంది. ఈ నిర్ణయం ద్వారా మా నాన్నో, లేదా మా భర్తో.. భారతీయుడని.. అందుకు నేను కూడా భారతీయుడిననే అవకాశాలు ఉండకపోవచ్చు మరీ.

మనదేశంతోపాటు, విదేశాల్లోనూ ఆధార్‌కార్డు, పాస్‌పోర్టును పౌరసత్వం ప్రమాణికంగా భావిస్తారు. ఈ రెండింటీ ద్వారానే భారతీయుడిగా గుర్తిస్తారు. ఇప్పటి వరకు ఈ డ్యాక్యుమెంట్లలో బంధువు పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే దీనికి చెక్‌ పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ విధానాన్ని అమలు పరచాలని చూస్తున్నట్లు సమాచారం.

సాధారణంగా ఆధార్డ్‌ కార్డు కావాలనుకునే వారు ఆన్‌లైన్‌గానీ, మీ సేవలోని గానీ దరఖాస్తు చేస్తుంటారు. దరఖాస్తు సమయంలో తండ్రి లేదా భర్త పేరు అడుగుతారు. అయితే ఇప్పడు కొత్తగా ఆధార్‌కార్డు తీసుకున్నవారు కూడా అన్ని ద్రువీకరణ పత్రాలు సమర్పించినా.. ఆధార్‌కార్డులో మాత్రం బంధువుల వివరాలు నమోదు చేయడం లేదు. ఆధార్‌కార్డులను అప్‌డేట్‌ చేయించుకునే వారి కార్డుల్లో కూడా సన్నాఫ్‌, డాటరఫ్‌ బదులుగా.. కేరాఫ్‌గా మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్పీఆర్‌లపై తీవ్ర నిరసనలు ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అయితే ఆధార్‌లో బంధుత్వాల తొలగింపు, కేరాఫ్‌ను కొత్తగా చేర్చుతున్నట్లు కేంద్రప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమెమిటో తేలియడం లేదంటూ.. ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి తన కథనంలో రాసుకొచ్చింది. కాగా తాజా మార్పుకుల సంబంధించి కేంద్రప్రభుత్వం యుఐడీఏ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసిందని ఓ ఉన్నతాధికారి తెలిపినట్లుగా ఆంధ్రజ్యోతి పత్రిక వెల్లడించింది.

ఈ విధానం సంక్షేమ పథకాల అర్హులకు ఇబ్బందులు తెచ్చేలా ఉంది. వితంతువు తన పెన్షన్‌ కోసం భర్త వివరాలు ఇస్తుంది, విద్యాసంస్థల్లో ఫీజు రియింబర్స్‌మెంట్‌ కోసం తండ్రి వివరాలను విద్యార్థి పేర్కొంటాడు. డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఓటర్‌ కార్డు వంటికి బంధుత్వ పత్రాలను సమర్పిస్తున్నారు. వివరంగా చెప్పాలంటే.. నిర్దిష్టమైన చిరునామా లేనప్పుడు.. మరొకరి చిరునామా ఇచ్చినప్పుడు మాత్రమే కేరాఫ్‌ను వాడుతుంటాం. దీని వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.

త్వరలో పాస్‌పోర్టులోనూ కేరాఫ్‌ పదాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేరాఫ్‌ పదాన్ని పాస్‌పోర్టుల్లో ప్రవేశపెట్టాలని విదేశాంగా శాఖ నిర్ణయం తీసుకుందని పాస్‌పోర్టు సీనియర్‌ అధికారి ఒకరు ఆంధ్రజ్యోతి దినపత్రికకు తెలిపారంట.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.