విజయవాడ: విజయవాడ బస్టాండ్ లో అనుమానాస్పదంగా ఓ యువతి మృతి చెందింది. మృతురాలు బస్టాండ్ లోని 37వ నంబర్ దగ్గర ప్లాట్ ఫాం దగ్గరున్న ATM దగ్గర కూర్చుంది. కూర్చున్నది కూర్చున్నట్లుగానే ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. మృతురాలు తూర్పుగోదావరి జిల్లా కలవచర్లకు చెందిన నిర్మలగా పోలీసులు గుర్తించారు. మృతురాలి బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.