హెచ్‌ఐవీ వ్యాప్తిని నిరోధించే మాత్ర.. ఏప్రిల్ నుంచి అందుబాటులోకి
By అంజి Published on 28 March 2020 11:34 AM ISTహైదరాబాద్: 'హెచ్‌ఐవీ వ్యాప్తిని నిరోధించే మాత్ర... ఏప్రిల్ నుంచి ఇంగ్లండ్‌లో అందుబాటులోకి' అంటూ బీబీసీ తెలుగు కథనం రాసింది. ఆ కథనం మేరకు.. ఏప్రిల్ నుంచి హెచ్‌ఐవీ వైరస్ వ్యాప్తిని నిరోధించే మాత్ర ఇంగ్లాండ్‌లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని యూకే ఆరోగ్య శాఖ మంత్రి మాట్ హాంకాక్ చెప్పారు. ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ మాత్ర వైరస్ వ్యాప్తి నిరోధక ఔషధం. రోజుకో మాత్ర వాడడం హెచ్‌ఐవీ వైరస్ వ్యాపిని నిరోధించవచ్చు. కండోమ్ లేకుండా శృంగారం చేసే సమయంలో హెచ్‌ఐవీ సంక్రమణను నిరోధిస్తుందని బీబీసీ తెలుగు తెలిపింది. ఇంగ్లండ్‌లో 1,03,800 మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారని తెలిసింది. ఈ ఔషధాన్ని విడుదల చేయడం ద్వారా రానున్న 10 సంవత్సరాల్లో హెచ్‌ఐవీ కేసులు పూర్తిగా తగ్గిపోతాయని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఔషధానికి సంబంధించిన ట్రయల్స్ వేల్స్‌లో జరుగుతున్నాయి. హెచ్‌ఐవీ సోకిన వారికి జీవితాంతం చికిత్సకు అయ్యే ఖర్చు కంటే.. ఈ ఔషధం ఖరీదు చాలా తక్కువే ఉంటుందని ఇంగ్లండ్ వైద్యులు చెబుతున్నారు.
హెచ్‌ఐవీ బాధితులకు అండగాఆ నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థ టెర్రెన్స్ హిగిన్స్ ట్రస్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇయాన్ మాట్లాడుతూ.. ఈ ఔషధం విప్లవాత్మకమైనదని అభివర్ణించారు. అయితే ఈ ఔషధం ప్రయోజనాల గురించి మరింత స్పష్టత రావాల్సి ఉందని ఆయన చెప్పారు. స్వలింగ, ద్విలింగ పురుషులు, మహిళలు, ట్రాన్స్ జెండర్లతో పాటు అందరికి ఈ మాత్రను అందుబాటులోకి తెవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఔషధం కోసం కృషి చేస్తున్న యూకే ప్రభుత్వాన్ని.. హెచ్‌ఐవీ బాధితుల స్వచ్ఛంద సంస్థ నిర్వహకుడు సర్ ఎల్టన్ జాన్ స్వాగతించారు. హెచ్‌ఐవీ వ్యాప్తి నిరోధక ఔషధంతో భవిష్యత్తులో కొత్త కేసులు నమోదు కావని, ఇది అద్భుతంగా పని చేస్తుందని అన్నారు. యూకే ప్రభుత్వం ఈ ఔషధాన్ని తీసుకురావడం చాలా ప్రశంసనీయమని ఎల్టన్ అన్నారు.
ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ మాత్రను రోజూ లేదా సెక్స్‌లో పాల్గొనడానికి ముందు మాత్రమే తీసుకోవాలి. ఇప్పటికే PrEP మాత్రను వాడిన వారిపై యూకే వైద్య పరిశోధనా మండలి అధ్యయనం చేసిందని బీబీసీ తెలుగు తెలిపింది. ఈ ఔషధం ద్వారా హెచ్‌ఐవీ వ్యాప్తిలో 86 శాతం తగ్గుదల కనిపించిందట. ఈ ఔషధాన్ని సరైన పద్ధతిలో తీసుకుంటే వంద శాతం ప్రభావంతంగా పని చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇది ముఖ్యంగా లైంగిక చర్యల్లో పాల్గొనే హెచ్‌ఐవీ బాధితులే లక్ష్యంగా తయారు చేస్తున్నారు.