ఆమె నిజంగానే..చైనా పెద్ద తల్లి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 9:25 AM GMT
ఆమె నిజంగానే..చైనా పెద్ద తల్లి..!

ఇది నమ్మశక్యం.. ఆ తల్లి నిజంగానే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది..!. 67 ఏళ్ల వయస్సులో ఓ ఆడ శిశువుకు జన్మనించింది. అయితే ఆ ఆడ శిశువుకు పుట్టగానే.. ఒక మేనకోడలు ఉంది..!. ఆమె 18 ఏళ్లు ఆ శిశువు కంటే కూడా సీనియర్. అంతే కాకుండా 40 సంవత్సరాలున్న తోబుట్టువులు కూడా ఉన్నారు. ఇందంతా ఏంటనుకుంటున్నారా?.. చైనాలోని షాన్డాంగ్‌లో 67 ఏళ్ల ఓ మహిళ ఆరోగ్యకరమైన ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అధికారుల నివేదికల ప్రకారం ఆమె సహజంగానే గర్భం ధరించినట్లు చెబుతున్నారు. దీనితో ఆమె నిజంగానే.. చైనా పెద్ద తల్లి అయ్యిందని అధికారులు తెలిపారు.Next Story