బామ్మ గారి కల

By సుభాష్  Published on  19 Jan 2020 8:48 AM GMT
బామ్మ గారి కల

97 ఏళ్ల వృద్ధురాలు ఏమి గెలుస్తుందిలే అని అందరూ లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడామె గెలవడమే కాదు రికార్డు సృష్టించింది. ఈ వయస్సులో కూడా 11 మంది అభ్యర్థులకు ధీటుగా నిలబడడమే కాక వారదంరినీ నెట్టుకొని గెలుపును సొంతం చేసుకుంది. ప్రజల మద్దతు దక్కించుకొని గ్రామ పంచాయతీ పాలన బాధ్యతలను చేపట్టింది.

రాజస్థాన్‌ లోని నీమ్‌ కా థానా సబ్‌ డివిజన్‌, పురానాబాస్‌ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. విద్యాదేవీ అనే 97 ఏళ్ల వృద్ధ మహిళ సర్పంచ్‌ గా పోటీ చేసింది. నామినేషన్ వేసినప్పట్నుంచే ఈవిడేం గెలుస్తుందిలే అనుకుని ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నారు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు. కానీ.. ప్రజలు ఆమెకు పట్టాభిషేకం కట్టారు. ఒకిరికి తెలియకుండా ఒకరు విద్యాదేవీకి ఓట్లు వేశారు. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో విద్యాదేవి సర్పంచ్‌ గా గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించడంతో ప్రత్యర్థి పార్టీలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి. 207 ఓట్ల మెజారిటీతో గెలిచిన బామ్మకు.. గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్‌ గా గెలిచిన బామ్మ.. గ్రామానికి సేవ చేయాలనే ఎన్నికల బరిలో నిలిచాననీ.. నన్ను గెలిపించినందుకు, తనకు మద్దతుగా నిలిచినందుకు ఓటర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఊరికి సేవ చేయాలనే తన చిన్ననాటి కలని 97 ఏళ్ల వయసుకి నెరవేర్చుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

Next Story