ఇది '90 ఎం.ఎల్' మందుని ప్రొత్సహించే సినిమానా..?
By Newsmeter.Network Published on 28 Nov 2019 5:53 AM GMTయంగ్ హీరో కార్తికేయ, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం '90 ఎంఎల్'. ఈ చిత్రానికి నూతన దర్శకుడు యెర్రా శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.
అయితే... '90 ఎం.ఎల్' టైటిల్ని బట్టి ఇది మద్యపానంను ప్రొత్సహించే సినిమాలా.. ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇదే విషయం గురించి డైరెక్టర్ ని శేఖర్ రెడ్డిని అడిగితే... ఈ చిత్రంలో హీరోకి ఆరోగ్య రీత్యా ఆల్కహాల్ తప్పనిసరి అని చెప్పడం జరిగింది అంతే తప్పా.. సినిమాలో ఎక్కడా మద్యపానాన్ని ప్రోత్సహించే సన్నివేశాలు లేవని స్పష్టం చేశారు. అంతే కాకుండా '90 ఎం.ఎల్' అనేది ఎంటర్టైన్మెంట్ తో కూడా కంప్లీట్ లవ్ స్టోరీ అని చెప్పారు.
ఈ మూవీ స్పెషాల్టీ ఏంటి అని అడిగితే... జనాలకు కథ పాయింట్ అర్ధంమవ్వాలనే విధంగా ముందుగా క్యారెక్టర్ ని ఎలివేట్ చేశామని తెలిపారు. మొదటి పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు అన్ని అంశాలు జనాలకు నచ్చే విధంగా జాగ్రత్తపడ్డామన్నారు.ఈ సినిమాలో రవి కిషన్ పాత్రను ఇంకా రివీల్ చేయలేని.. ఆ పాత్ర కొంచెం సైకో షేడ్స్ లో ఉంటుందని అన్నారు. అలాగే మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందన్నారు. ఆ పాత్ర అందరికి నచ్చుతుందని.. అదే విధంగా ఈ సినిమా ఖచ్చితంగా అందరిని ఆకట్టుకుందని చెప్పారు.