రజినీ 'దర్బార్' ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్.. ఇంత‌కీ.. రెస్పాన్స్ ఏంటి..?

By Newsmeter.Network  Published on  28 Nov 2019 5:28 AM GMT
రజినీ దర్బార్ ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్.. ఇంత‌కీ.. రెస్పాన్స్ ఏంటి..?

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం 'దర్బార్'. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజిని ఒక ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న‌ ఈ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన 'దర్బార్' మోషన్ పోస్టర్ కి ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. అయితే లేటెస్ట్ గా 'దర్బార్' చిత్రం నుండి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

దుమ్ము- ధూళి…నేనేరా ఇక మీద ఉన్న చోటే దర్బారు.. అంటూ రజినీకాంత్ 'దర్బార్'లో రౌడీల అంతు చూడబోతున్నారు. ఈ విషయాన్ని తెలిపే విధంగా సాగే ఈ మాస్ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. గాన గంధర్వుడు ఎస్.పి బాలసుబ్రమణ్యం తనదైన శైలిలో ఆలపించారు. రజిని మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని చేసిన ఈ పాట ఆయ‌న స్టైల్ కు తగ్గట్టుగా ఫాస్ట్ బీట్లో ఉండేలా లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్‌ ర‌విచంద్ర‌న్ స్వరపరిచారు. ఈ పాటతో అనిరుద్ మరోసారి తన మాస్ అప్పీల్‌ను చూపించాడు. 'దర్బార్' చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ పక్కా మాస్ సాంగ్ కావడంతో రజిని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

Next Story