‘ఆర్ఎక్స్ 100′ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన ’90 ఎంఎల్’ సినిమా విడుదలను అడ్డుకుంటామ‌ని మద్యపాన నిషేధ పోరాట సమితి పేర్కొంది. ఈ సంధ‌ర్బంగా వారు మాట్లాడుతూ.. మ‌ద్యంపై సినిమాలు తీసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇటువంటి చిత్రాల వల్లనే యువత పెడదోవపట్టి.. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. చిత్రంలో మద్యపానాన్ని ప్రోత్సహించే సన్నివేశాలను తొలగించి.. చిత్రం పేరును మార్చాలని వారు డిమాండ్ చేశారు. రేపు చిత్ర విడుదల సందర్భంగా.. ఐమాక్స్ థియేటర్ వ‌ద్ద‌ శాంతియుతంగా నిరసన తెలుపుతామని మద్యపాన నిషేధ పోరాట సమితి తెలిపింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.