ఏపీలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా మరో 80
By తోట వంశీ కుమార్ Published on 27 April 2020 12:03 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదు. రోజు రోజు ఈ మహమ్మారి విజృంభణ పెరిగిపోతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1177కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి 31 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు 235 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 911 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 33 కరోనా పాజిటివ్ కేసులు రాగా.. కర్నూల్ లో 13, గుంటూరు 23, కడప 3, ప్రకాశం 3, నెల్లూరు 7, శ్రీకాకుళం 1, వెస్ట్ గోదావరి 3 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 292 కేసులు, గుంటూరు 237, కృష్ణా జిల్లాలో 210 కేసులు నమోదైయ్యాయి.