వేటగాళ్ల విష ప్రయోగంతో 8 నెమళ్లు మృతి

By సుభాష్  Published on  26 May 2020 2:48 AM GMT
వేటగాళ్ల విష ప్రయోగంతో 8 నెమళ్లు మృతి

మంచిర్యాల: వేటగాళ్ల విష ప్రయోగాలకు నెమళ్ల మృతి చెందాయి. నస్పూర్‌ మండలం శ్రీరాంపూర్‌ అటవీ ప్రాంతంలో 8 నెమళ్లు మృతి చెందడంపై కలకలం రేపుతోంది. నెమళ్ల మృతిపై అటవీశాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. కాగా, విషం కలిపిన వడ్ల గింజలు తిన్నట్లు అటవీశాఖ అధికారుల విచారణ వెల్లడైంది.

ఈ విషప్రయోగం చేసిన వేగగాళ్ల కోసం గాలిస్తున్నారు. విష ప్రయోగం చేసిన వేటగాళ్లను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story
Share it