ఏపీలో మరో 73 కరోనా పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్Published on : 29 April 2020 11:50 AM IST

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రాష్ట్రంలో రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,332కు చేరింది. మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు 287 కోలుకుని డిశ్చార్జి కాగా. 1014 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారీన పడి 31 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 29 గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. గుంటూరు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 283కి చేరింది. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 343 కేసులు నమోదైయ్యాయి. ఇక విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు.

Also Read 
అప్పటి వరకూ పది పరీక్షలు లేవ్..Next Story