మేడ్చల్‌లో దారుణం.. ఆరేళ్ల బాలిక దారుణ హత్య
By తోట వంశీ కుమార్ Published on 2 July 2020 5:02 PM ISTతల్లి వివాహేతర సంబంధం అభం శుభం తెలియని చిన్నారిని బలితీసుకుంది. తల్లిపై కోపంతో ఆరేళ్ల కుమారైను గొంతుకోసం చంపేశాడో కిరాతకుడు. ఈ దారుణ ఘటన మేడ్చల్ జిల్లా పోచారంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కల్యాణ్, అనూష దంపతులు పోచారంలోని ఇస్మాయిల్‌గూడ విహారి హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల కుమారై ఆద్మ ఉంది. కాగా.. మూడు నెలల క్రితం సికింద్రాబాద్‌లోని భవానీనగర్‌కు చెందిన కరుణాకర్‌తో అనూషకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కాగా.. కొద్ది రోజలుగా అనూష రమేష్ అనే మరో యువకుడితో సన్నిహితంగా ఉంటుంది. ఈ విషయం తెలిసిన కరుణాకర్ ఆగ్రహానికి లోనైయ్యాడు.
ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం 12.30గంటల సమయంలో అనూష ఇంటికి కరుణాకర్ వచ్చాడు. అయితే.. అప్పటికే అక్కడ రమేష్ ఉన్నాడు. కరుణాకర్ రాకను గమనించిన అనూష.. రమేష్‌ను బాత్‌రూంలో దాచింది. గదిలోంచి బయటకు రావాలని రమేష్‌ను ఒత్తిడిచేశాడు. బయటకు రాకపోతే చిన్నారి ఆద్యను చంపుతానని కరుణాకరన్ బెదిరించాడు. అయినా అతడు బయటకు రాకపోవడంతో అన్యాయంగా ఆ చిన్నారి గొంతు కోసి చంపాడు. ఆద్య అరుపులతో రమేశ్ బయటకు వచ్చాడు. రమేశ్‌పై కూడా కత్తితో దాడిచేయగా.. అతడు పరుగులు తీశాడు. అనంతరం తన గొంతును తానే కోసుకున్నాడు కరుణాకర్. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని కరుణాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.