ఈ నెల 21 నుంచి క‌రోనా కేసులు త‌గ్గుముఖం : మ‌ంత్రి ఈట‌ల‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 April 2020 1:28 PM GMT
ఈ నెల 21 నుంచి క‌రోనా కేసులు త‌గ్గుముఖం : మ‌ంత్రి ఈట‌ల‌

తెలంగాణ రాష్ట్రంలో మంగ‌ళ‌వారం కొత్త‌గా ఆరు కేసులు న‌మోదైన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద‌ర్ తెలిపారు. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో 1,009 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైయ్యాయ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 25 మంది మృతి చెందార‌న్నారు. ఈ రోజు న‌మోదైన కేసులు మొత్తం జీహెచ్ఎంసీ ప‌రిధిలోనివేన‌న్నారు మీడియా స‌మావేశంలో మంత్రి వెల్ల‌డించారు.

మొత్తం న‌మోదు అయిన కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 374 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. ప్ర‌స్తుతం 610 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల్లో 50 శాతానికి పైగా కేసులు జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే బ‌య‌ట ప‌డ్డాయ‌ని తెలిపారు. క‌రోనా మృతుల్లో దాదాపు 12 మంది క్యాన్స‌ర్‌, బీపీ ఇత‌ర వ్యాధుల కార‌ణంగా చ‌నిపోయార‌ని, ఈ నెల 21 నుంచి క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని మంత్రి చెప్పారు.

Next Story