చాలా అరుదు: 5 కిలోల శిశువు జననం
By సుభాష్ Published on 10 May 2020 4:42 PM GMT
అప్పుడప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని సంఘటనలు అరుదుగా చోటు చేసుకుంటాయి. ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ 5కిలోల ఆడ శిశువుకు జన్మనిచ్చింది. జిల్లాకు చెందిన వేంసూరు మండలం కల్లూరుగూడెంకు చెందిన సౌజన్యం అనే గర్భిణి ప్రసూతి కోసం పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది.
అయితే వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేసి పాపను బయటకు తీశారు. పుట్టిన శిశువు 5కిలోల 100 గ్రాములు ఉందని వైద్యుడు రమేష్ తెలిపారు. ఇంత బరువుతో శిశువు జన్మించడం చాలా అరుదు అని చెప్పారు. తల్లీబిడ్డలు కూడా ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు.
Next Story