24 గంటల్లో 56 కేసులు..ఏపీలో విజృంభిస్తోన్న మహమ్మారి

By రాణి  Published on  22 April 2020 6:46 AM GMT
24 గంటల్లో 56 కేసులు..ఏపీలో విజృంభిస్తోన్న మహమ్మారి

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ ప్రభుత్వం అసలు లెక్కలు చూపించకుండా ప్రజలను మభ్య పెడుతోందన్న ఆరోపణలు ఇంకా వెల్లువెత్తున్నాయి. ఉదాహరణకు విశాఖలో గడిచిన 20 రోజుల్లో 21కేసులు నమోదవ్వగా 19 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా ఇద్దరికి మాత్రమే చికిత్స అందించాల్సి ఉంది. కానీ విశాఖలో పరిస్థితి అలా లేదు. స్థానిక ఛాతీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో 50 మందికి పైగా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖలో కొత్తకేసులు నమోదవుతున్నా అధికారులు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారా ? ఎందుకు అని ప్రశ్నిస్తే.. కారణం ఏపీకి కాబోయే రాజధాని విశాఖలో కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉందని చూపించడమేనని తెలుస్తోంది.

Also Read : మొక్కలు నాటుదాం..భూదేవిని రక్షించుకుందాం..

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 56 కొత్తకేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 6, గుంటూరు 19, కడప 5, కృష్ణా 3, కర్నూల్ 19, ప్రకాశంలో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 813కి పెరుగగా 24 మంది మృతి చెందారు. ప్రస్తుతం 120 మంది డిశ్చార్జ్ అవ్వడంతో 669 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కర్నూల్ లో అత్యధికంగా 203 కేసులు నమోదవ్వగా 5గురు చనిపోయారు. నలుగురు మృతి చెందగా 194 మంది చికిత్స పొందుతున్నారు.

Also Read :గుంటూరులో బాలిక ఆత్మహత్య

Next Story