గుంటూరు జిల్లా జాగర్లమూడి గ్రామంలో తల్లి మందలించిందని మనస్తాపానికి 9వ తరగతి బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..సంగం జాగర్లమమూడి గ్రామానికి చెందిన కారంకి స్నేహస్మిత (14) 9వ తరగతి చదువుతోంది. లాక్ డౌన్ తో స్కూళ్లకు సెలవులివ్వడంతో ఇంట్లోనే ఉంటున్న స్నేహ తరచూ ఫోన్ మాట్లాడుతోంది. ఇది గ్రహించిన తల్లి అస్తమానం ఆ ఫోన్ లో ఏంటి సొద అని మందలించింది. తల్లి తిట్టడంతో మనస్తాపానికి గురైన స్నేహస్మిత మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Also Read : కర్ణాటక ప్రభుత్వం వినూత్న ప్రయత్నం..బెంగళూరులో ట్రయల్

అంతకుముందు బయటికెళ్లిన తల్లి ఝాన్సీరాణి ఇంటికొచ్చి చూసేసరికి కూతురు చనిపోయి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఝాన్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్నేహ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read : ఆదుకోవాల్సిన సమయంలో..ప్రజల ప్రాణాలతో చెలగాటమా ?

రాణి యార్లగడ్డ

Next Story