ప.బెంగాల్: కోల్ కతాలో దేవీ నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి. ప్రతి వీధిలో అమ్మవారి విగ్రహాలు పెట్టి ఆరాధిస్తారు. ఈ సంవత్సరం, సెంట్రల్ కోల్ కతాలోని సంతోష్ మిత్రా కూడలి వద్ద 50 కిలోలు బంగారం ఉపయోగించి 13 అడుగులు ఎత్తుగల అమ్మవారి విగ్రహం తయారు చేయిస్తున్నారు.

రూ.20 కోట్ల విలువైన బంగారంతో ఆ విగ్ర‌హాన్ని రూపొందిస్తున్నారు. ఆ కనక దుర్గను పైనుంచి కింది వరకూ కనకంతో తయారు చేయిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం తులం బంగారం ధ‌ర రూ.40 వేల వ‌ర‌కు ఉంది. దీంతో ఈ విగ్ర‌హం ఖ‌రీదు దాదాపు రూ.20 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

అయితే, ఈ కూడలిలో అమ్మవారి విగ్రహం కోసం బంగారం వాడటం ఇదే మొదటిసారి కాదు. 2017లో బంగారు చీరతో అమ్మను అలంకరించారు. 2018లో వెండి రధాన్ని కనకదుర్గమ్మ అధిరోహించినట్లు విగ్రహం చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.