వరంగల్‌లో విషాదం.. గోడ కూలి ఐదేళ్ల చిన్నారి మృతి

By అంజి  Published on  1 March 2020 9:57 AM GMT
వరంగల్‌లో విషాదం.. గోడ కూలి ఐదేళ్ల చిన్నారి మృతి

ముఖ్యాంశాలు

  • కాకతీయ యూనివర్సిటీ రోడ్‌లో ప్రమాదం
  • మురుగు కాల్వ పనులు చేస్తుండగా కూలిన గోడ
  • ఐదేళ్ల బాలిక మృతి, మరో ఏడేళ్ల బాలుడికి గాయాలు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా: హన్మకొండలో ప్రమాదం చోటు చేసుకుంది. 43వ డివిజన్‌లోని కాకతీయ యూనివర్సిటీ రోడ్డులో పట్టణ ప్రగతి పనులు చేస్తుండగా గోడ కూలింది. మురుగు కాల్వ పనులు చేస్తుండగా పొక్లెయినర్‌ తగిలి ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో అక్కడే ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై గోడ పెల్లలు మీద అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఏడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు ఆ బాలుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన హన్మకొండలోని కొత్తూరు జెండా ప్రాంతంలో సంభవించింది.

విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్‌విప్‌, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌, జిల్లా కలెక్టర్‌ బాధితుల కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి మృతదేహానికి వినయ్‌భాస్కర్‌ నివాళులర్పించారు. కాగా చిన్నారి కుటుంబానికి సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. చిన్నారి తల్లికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం కల్పిస్తామని, కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని వినయ్‌భాస్కర్‌ పేర్కొన్నారు.

కళ్లముందు ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా గోడ పెల్లలు మీద మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండలవిసేలా రోదిస్తున్నారు. బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో కొత్తూరు జెండా ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story