శంకుస్థాపన చేసిన 4 ఏళ్ల తరువాత రాజధానిపై కమిటీ ఏంటీ?!: ట్విటర్‌లో చంద్రబాబు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 5:08 PM GMT
శంకుస్థాపన చేసిన 4 ఏళ్ల తరువాత రాజధానిపై కమిటీ ఏంటీ?!: ట్విటర్‌లో చంద్రబాబు

అమరావతి: రాష్ట్రం నడిబొడ్డున, నది ఒడ్డున అందరికీ అందుబాటులో ఉండాలని అమరావతిని రాజధానిగా నిర్ణయించామని ట్విట్ చేశారు చంద్రబాబు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా రాజధానిని స్వాగతించారని చెప్పారు. శివరామకృష్ణన్ కమిటీ చేసిన ప్రజాభిప్రాయసేకరణ, కమిటీకి వచ్చిన మెయిల్స్ కూడా అమరావతినే అనుకూల ప్రాంతంగా ధృవీకరించాయన్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన నాలుగేళ్ల తరువాత ఇప్పుడు రాజధానిపై కమిటీ వేయడం ఏంటని ట్విటర్‌లో చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘హైకోర్టు వద్ద తాగడానికి టీ కూడా లేని పరిస్థితి’’ అనే వ్యాఖ్యలు మీకు తలవంపులుగా లేవా? అని ఘాటుగా సీఎం వైఎస్ జగన్‌ను క్వశ్చన్ చేశారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వానికి రాజధానిని నిర్మించే సత్తాలేదన్నారు. ఈ విషయాన్ని ప్రజల ముందు ఒప్పుకునే నిజాయితీ కూడా లేదన్నారు ట్విటర్‌లో చంద్రబాబు.





Next Story