ఏపీలో 24గంటల్లో 43 కొత్త కేసులు
By తోట వంశీ కుమార్ Published on 9 May 2020 12:31 PM ISTఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,388 సాంపిల్స్ ను పరీక్షించగా.. కొత్తగా మరో 43 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1930 కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి 44 మంది మృతి చెందారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 887మంది డిశ్చార్జి కాగా.. 999 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదు అయిన కేసుల్లో అత్యధికంగా కృష్ణాలో 16 కేసులు నమోదు కాగా.. చిత్తూరులో 11, అనంతపురంలో 3, గుంటూరులో 2, కర్నూలులో 6, విశాఖపట్నంలో 5 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో మొత్తంగా కర్నూల్ జిల్లాలో 553, గుంటూరులో 376, కృష్ణాలో 338 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Also Read
సెప్టెంబర్ 1 నుండి రేషన్ డోర్ డెలివరీNext Story