తెలంగాణలో దూసుకెళ్తున్న కరోనా.. ఈరోజు ఎన్నికేసులంటే..
By సుభాష్ Published on 18 May 2020 10:13 PM ISTతెలంగాణలో కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టినా గత వారం రోజులుగా విజృంభిస్తోంది. అయితే రాష్ట్రంలోని జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాకపోగా, ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదు కావడంతో మరింత ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా సోమవారం రాత్రి తెలంగాణ ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం..
గడిచిన 24 గంటల్లో 41 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం 1592 కేసులు నమోదు కాగా, 556 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. సోమవారం కరోనా నుంచి కోలుకుని 10 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ మొత్తం 1002 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఎలాంటి కరోనా మరణాలు సంభవించకపోగా.. ఇప్పటి వరకూ 34 మంది మృతి చెందారు. ఈ రోజు నమోదైన కరోనా కేసులు 26 జీహెచ్‌ఎంసీలో నమోదు కాగా, 12 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవి, మరో మూడు కేసులు మేడ్చల్‌లో నమోదయ్యాయి.
ఇక జీహెచ్‌ఎంసీలో తప్ప ఇతర జిల్లాల్లోనూ ఎలాంటి కేసులు నమోదు కావడం లేదు. ఇక తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మే 29 వరకు ఉన్న లాక్‌డౌన్‌ను 31 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే లాక్‌డౌన్ నుంచి భారీగానే సడలింపులు ఇచ్చారు. ఆర్టీసీ బస్సులన్నీ మంగళవారం నుంచి రోడ్లెక్కనున్నాయి. అలాగే హైదరాబాద్ తప్ప మిగతా జిల్లాల్లో అన్ని షాపులు తెరుచుకోవచ్చని ప్రకటించారు. వీటితో పాటు మరి కొన్ని సడలింపులు ఇచ్చారు.