కల్కిలో సోదాలు: కోట్ల రూపాయల డబ్బులు, కిలోల కొద్దీ బంగారం..!!!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Oct 2019 12:57 PM ISTచిత్తూరు: కల్కి ఆశ్రమంలో సోదాలకు సంబంధించి ఐటీ అధికారులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రూ. 5కోట్లు విలువచేసే వజ్రాలు, రూ.26 కోట్లు విలువచేసే బంగారం, రూ.43.39 కోట్లు నగదుతోపాటు, రూ.18 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు చెప్పారు. మొత్తం రూ.96 కోట్లు విలువచేసే బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.
రూ.409 కోట్ల విలువ చేసే రసీదులు కూడా ఉన్నట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు.
మొన్నటి నుంచి ఏకం కల్కి ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఐటీ సోదాలు భారీ ఎత్తున సాగుతున్నాయి. హైదరాబాద్ లోనూ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఏకం కల్కి ఆధ్యాత్మిక కేంద్రాల్లో సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే..కల్కి కుమారుడు, కోడలను అధికారులు ప్రశ్నించారు. ఆశ్రమానికి సంబంధించిన ఉన్నత ఉద్యోగులను కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే..కల్కి ఆశ్రమాల్లో దొరుకుతున్న డబ్బుపై అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సోదాలు మరికొన్ని రోజులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
�