తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు

By సుభాష్  Published on  21 May 2020 3:21 PM GMT
తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో 38 కేసులు న‌మోదయ్యాయి. తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1699 కరోనా కేసులు నమోదు కాగా, 45 మంది మృతి చెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల్లో 1036 మంది డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 618 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో 26 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే న‌మోదు అవుతుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ఈ రోజు 23 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

గతంలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. ఇటీవల నుంచి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇతర జిల్లాల్లో ఏలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కావడం లేదు. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే పాజిటివ్‌ కేసులు నమోదు కావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

ఇక దేశ వ్యాప్తంగా రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ముందుగా కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా.. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ నేపథ్యంలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. అప్పటి నుంచి పాజిటివ్‌ కేసుల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నాలుగో దశ లాక్‌డౌన్‌ కొనసాగిస్తోంది. మే 31వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

Untitled 20 Copy

Next Story