సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదీనా సమీపంలోని అల్ ఆఖల్ సెంటర్ వద్ద యాత్రికులతో వెళుతున్న బస్సు ఒక భారీ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో 35 మంది విదేశీయులు మృతి చెందారు. తక్షణమే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ప్రయాణికుల్లో ఆసియా, అరబిక్ జాతీయులు ఉన్నారని తెలుస్తోంది. సౌదీ అరేబియాలోని మక్కా నుంచి మదీనాకు వెళ్లే దారిలో ఈ ప్రమాదం జరిగింది. మదీనాకు 170 కిలోమీటర్ల ముందు ఉన్న గ్రామంలో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో సంఘటన జరిగినట్టు సమాచారం. దుర్ఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.