తెలంగాణ‌లో పెరిగిన క‌రోనా కేసులు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 May 2020 3:36 PM GMT
తెలంగాణ‌లో పెరిగిన క‌రోనా కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో గ‌త కొన్ని రోజులుగా క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతున్న‌ట్లు క‌నిపించ‌గా.. నేడు ఒకే సారి కేసుల సంఖ్య పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో 31 కేసులు న‌మోదు అయ్యాయి. వీటితో క‌లిపి రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1163 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 30 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల్లో 751 మంది డిశ్చార్జి కాగా.. 382 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో 30 జీహెచ్ఎంసీ ప‌రిధిలోనివే కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రంగ‌ల్‌(రూర‌ల్), యాదాద్రి భువ‌న‌గిరి, వ‌న‌ప‌ర్తి జిల్లాలో ఒక్క క‌రోనా పాజిటివ్ కేసులు కూడా న‌మోదు కాలేదు.

Untitled 5

Next Story