వైసీపీ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు

By అంజి
Published on : 9 March 2020 1:10 PM IST

వైసీపీ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌: నటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్‌ పృథ్వీరాజ్‌ ఓ టీవీ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో గొప్ప వ్యక్తి చిరంజీవేనని పొగిడాడు. ఆయన లేకుంటే తాను సూసైడ్‌ చేసుకునేవాడినని అన్నారు. పాపం వాడు ఎలా ఉన్నాడో చూడండ్రా అంటూ.. కొందరికి చిరంజీవి చెప్పాడని, తనను ఆదుకున్న చిరంజీవి లాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో మరోకరు లేరని చెప్పాడు. ఎస్వీబీసీ వివాదం తర్వాత తీవ్ర మానసిక ఇబ్బందికి గురయ్యానని చెప్పారు. మిగిలిన వాళ్లు కూడా ఇండస్ట్రీలో ఉండొచ్చని.. తన దృష్టిలో మాత్రం ఎవరూ లేరని అన్నారు. మహిళ ఉద్యోగితో రాసలీలల ఫోన్‌ వ్యవహారం బయటపడితన ఫృథ్వీ రాజ్‌ ఎస్వీబీసీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్రలతోనే తాను బలి అయ్యాయని అంటున్నారు. సొంత పార్టీ వారే తనపై కుట్రలు చేశారన్న ఆయన.. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమన్నారు. ఆ ఫోన్‌ కాల్‌ ఫేక్‌ అంటూ తెలిపారు. తనను ఇబ్బంది పెట్టేవారిని ఆ వెంకటేశ్వరస్వామి శిక్షిస్తాడని అన్నారు. అయితే వైసీపీ పార్టీ వదలబోనని తెలిపారు. తనను ఇరికించిన వారంతా నాశనమైపోతారని అన్నాడు.

ఎస్వీబీసీ చైర్మన్‌ పదవికి ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించగా.. తనను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి రాజీనామా చేయాలని కోరాడని తెలిపారు. ఈ విషయాన్ని అప్పుడే ప్రెస్‌క్లబ్‌కు కూడా వెళ్లి చెప్పానన్నారు. పార్టీ ప్రతిష్టను పెంచేందుకు రాజీనామా చేశానని, సీఎం వైఎస్‌ జగన్‌ తనకు ఏం చెప్పలేదన్నారు. మొత్తానికి చివరలో తనను చెప్పుతో కొట్టి బయటకు పంపించారంటూ కామెంట్‌ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తానని పృథ్వీరాజ్‌ తెలిపారు.

ఈ మధ్య కాలంలో పృథ్వీరాజ్‌ కాంట్రవర్సీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయాడు. టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డికి తెలియకుండా 30 ఉద్యోగాలు వెరే వారికి ఇప్పించారని ఆరోపణలు ఉన్నాయి. 1980వ దశకంలోనే పృథ్వీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే 30 ఇయర్స్‌ ఇండస్ట్రీకి అనుకున్నంత పేరు రాలేదు. ఖడ్గం సినిమాతో మెప్పించిన.. ఆతర్వాత వచ్చిన లౌక్యం సినిమాతో పృథ్వీరాజ్‌ మంచి కమెడియన్‌గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ బీజీ అయిపోయారు. ఇటీవల కాలంలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పృథ్వీరాజ్‌ వైసీపీ తరఫున ప్రచారం చేశారు. ఆ సమయంలోనే బండ్ల గణేష్‌, పవర్‌ పవన్‌ కల్యాణ్‌లపై విరుచుపడ్డాడు. ఆ తర్వాత మెగా కుటుంబాన్ని టార్గెట్‌ చేసుకొని విమర్శలు గుప్పించాడు. అయితే తనకు వారితో ఎలాంటి గొడవలు లేవని, తాము మంచి స్నేహితులమంటూ చెప్పుకొచ్చాడు.

Next Story