తెలంగాణలో 30కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

By Newsmeter.Network  Published on  23 March 2020 8:58 AM GMT
తెలంగాణలో 30కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌.. భారత్లోనూ విజృంభిస్తోంది. ఇప్పటికే భారత్‌లో ఈ వైరస్ భారిన పడి 416 మంది వరకు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతుండగా.. ఎనిమిది మంది మృతి చెందారు. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం అన్నిప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు తెలంగాణలోనూ ఈ వైరస్‌ వేగంగా విస్తరిస్తుంది. సోమవారం ఒక్కరోజే మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలను అప్రమత్తం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కూడా ప్రకటించింది. మార్చి 31 వరకు ప్రజలెవరూ అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Also Read :కరోనా ఎఫెక్ట్.. వీసీ ద్వారా ఇంటి నుంచే వాదించండి

ఈ నేపథ్యంలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు వకింత భయాందోళన చెందుతున్నారు. లండన్ నుంచి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తితో పాటు.. ప్రాన్స్‌ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కరోనా టెస్టుల్లో పాజిటివ్ రిపోర్టు వచ్చింది. మరోవైపు కరీంనగర్‌లో ఇండోనేషియా నుంచి వచ్చిన పదిమందికి ఆశ్రయం కల్పించిన వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ౩౦కు చేరింది. ఈ సమయంలోనూ కొంత ఊరట చెందాల్సిన అంశం ఏమిటంటే.. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో 28 మంది విదేశాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. తెలంగాణలో ఉంటూ కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇదిలాఉంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. ఇంట్లోని ఒక వ్యక్తి మాత్రమే వెళ్లి నిత్యావసర సరులు తెచ్చుకోవాలని, ఐదుగురు కంటే ఎక్కువ మంది బయట తిరగొద్దని సీఎం కేసీఆర్‌ సూచించారు. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, డైరీలకు మాత్రమే అధికారులు అనుమతిచ్చారు.

Next Story