కేరళలో మూడేళ్ల చిన్నారికి కరోనా వైరస్‌ సోకింది. ఇటీవల ఇటలీలో చిన్నారి కుటుంబం పర్యటించి వచ్చింది. ఎర్నాకుళం మెడికల్‌ కాలేజీలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. భారత్‌లో ఇప్పటివరకు 42 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కేరళలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. కరోనా నిర్దారణ అయిన వ్యక్తులను ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

తమిళనాడులో కోవిడ్‌-19 వైరస్‌ తీవ్ర కలకలం రేపుతోంది. కాంచీపురానికి చెందిన మరో వ్యక్తికి కరోనా వైరస్‌ సోకిందని నిర్దారణ అయ్యింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. కాంచీపురం జిల్లా వ్యాప్తంగా రాపిడ్‌ రిసోర్స్‌ టీమ్స్‌ ఏర్పాటు చేశారు. 22 మందికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించామని తమిళనాడు వైద్యులు తెలిపారు. దేవాలయాల్లో భక్తులకు వ్యాధి సోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

తెలంగాణలో కరోనా వైరస్‌పై ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. ఇప్పటి వరకు ఎయిర్‌పోర్టులో 36,419 మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించారు. నిన్న 4,683 మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించారు. గాంధీ, ఫీవర్‌ హాస్పిటల్స్‌లో ఐసోలేషన్‌లో 250 మంది చికిత్స పొందుతున్నారు.

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో హోళీ ఆడొద్దని ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు సూచించారు. గుమిగూడి హోళీ వేడుకలు జరుపుకుంటే వైరస్‌ సోకే ప్రమాదం ఉంద ఎయిమ్స్‌ వైద్యుల తెలిపారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.