అవరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతినెల రెండువ బుధవారం, నాలుగో బుధవారం కేబినెట్ సమావేశం కావాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. సంబంధిత రోజు సెలవైతే..కేబినెట్ సమావేశం నెక్ట్స్ డే జరగనుంది. కేబినెట్లో పెట్టాల్సిన అంశాలు మూడ్రోజులు ముందుగా సెక్రటరీలకు పంపించాల్సి ఉంది.