తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 2,734 పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on 1 Sep 2020 4:08 AM GMTతెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,734 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,27,697కి చేరింది. నిన్న ఒక్క రోజే 9 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 836కి చేరింది. అలాగే తాజాగా 2,325 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 95,162కి చేరింది. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.65శాతం ఉండగా, దేశంలో 1.77 శాతం ఉందని తెలిపింది. ఇక కోలుకున్న వారి రేటు రాష్ట్రంలో 74.5శాతం ఉండగా, దేశంలో 76.94 శాతం ఉన్నట్లు పేర్కొంది. అలాగే హోమ్ ఐసోలేషన్‌లో 24,598 చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..
ఆదిలాబాద్ – 27
భద్రాద్రి కొత్తగూడెం- 117
జీహెచ్‌ఎంసీ -347
జగిత్యాల-91
జనగాం- 47
జయశంకర్ భూపాలపల్లి – 15
జోగులాంబ గద్వాల – 42
కామారెడ్డి -72
కరీంనగర్ -106
ఖమ్మం -161
ఆసిఫాబాద్ – 16
మహబూబ్ నగర్ -66
మహబూబాబాద్ -81
మంచిర్యాల- 96
మెదక్ – 43
మేడ్చల్ మల్కాజ్‌గిరి – 121
ములుగు –24
నాగర్‌కర్నూల్ – 48
నల్లగొండ – 191
నారాయణపేట -18
నిర్మల్ -39
నిజామాబాద్ – 114
పెద్దపల్లి – 74
రాజన్న సిరిసిల్ల -49
రంగారెడ్డి -212
సంగారెడ్డి -16
సిద్దిపేట – 109
సూర్యాపేట-107
వికారాబాద్-12
వనపర్తి –55
వరంగల్ రూరల్ –30
వరంగల్ అర్భన్ -112
యాదాద్రి భువనగిరి -76 కేసులు నమోదు అయ్యాయి.