తండ్రితో న‌డుచుకుంటూ వెలుతున్న ఓ యువ‌కుడిని కిడ్నాప్ చేశారు. అనంత‌రం అత‌డి త‌ల‌కు గ‌న్ గురిపెట్టాడు. చేతిలో తాళి పెట్టారు. తాళి క‌ట్ట‌కుంటే చంపేస్తామ‌ని బెదిరించారు. చేసేది ఏమీ లేక ఆ యువ‌కుడు తాళి క‌ట్టాడు. కిడ్నాప్ నుంచి త‌ప్పించుకున్న ఆ యువ‌కుడి తండ్రి అదిరిపోయే ట్విస్టు ఇచ్చాడు. ఇదంతా చ‌దువుతుంటే.. ఏదో సినిమాలో సీన్‌లా అనిపిస్తోంది గ‌దూ.. కానీ ఇది నిజంగా జ‌రిగింది. ఈ ఘ‌ట‌న బీహార్‌లో చోటు చేసుకుంది.

యువకుడిని కిడ్నాప్ చేసి బలవంతంగా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేందుకు యత్నించిన ఘటన బిహార్ లోని వైశాలి జిల్లాలో జరిగింది. జందహా మార్కెట్‌ ప్రాంతానికి చెందిన అమిత్(24) తన తండ్రి ముసఫిర్ రాయ్‌తో క‌లిసి ఆస్ప‌త్రికి వెలుతుండ‌గా కొంద‌రు వ్య‌క్తులు తుపాకుల‌తో బెదిరించి అమిత్ ను కిడ్నాప్ చేసి సమస్తిపూర్ జిల్లా బరుణ రసల్‌పూర్‌కి తీసుకెళ్లారు. అక్క‌డ ఓ అమ్మాయి ఉంది. అమిత్ చేతికి తాళి ఇచ్చి క‌ట్ట‌మ‌న్నారు. తాను క‌ట్ట‌న‌ని మొండి కేయడంతో త‌లకి తుపాకీ గురి పెట్టారు. అమ్మాయితో బలవంతంగా వివాహం జరిపించారు.

ఇదిలా ఉండ‌గా.. కిడ్నాప్ నుంచి తప్పించుకున్న అమిత్ తండ్రి రాయ్ పోలీసులను ఆశ్రయించడంతో వారు.. రసల్‌పూర్ చేరుకుని అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. అమిత్‌ని రక్షించి అతని తండ్రితో పంపించేశారు. వివాహం చేసుకున్న అమ్మాయిని ఆమె తల్లిదండ్రులకి అప్పగించడంతో కిడ్నాప్ కథ అడ్డం తిరిగింది. ఆ తతంగమంతా సెల్‌ఫోన్ కెమెరాల్లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త అప్ప‌టికే వైరల్‌గా మారింది. అమిత్ స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్న పోలీసులు.. నావల్ రాయ్, వినోద్ రాయ్‌ సహా ఐదుగురిపై కేసు న‌మోదు చేశారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.