ఎన్నో ఆశలతో ఆ యువతి పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలిసి తట్టుకోలేకపోయింది. ఈ విషయం పై భర్తను చాలా సార్లు నిలదీసింది. అయినా ఆ భర్త మారకపోగా.. ఇంటికి రావడం తగ్గించేశాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆ వివాహిత తనువు చాలించింది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరులో చోటు చేసుకుంది.

మైసూర్‌లోని టీకీ లేజౌట్‌లో బసవరాజ్‌కు లేఖన(25) అనే యువతి తో ఏడాది క్రితం పెళ్లి అయ్యింది. పెళ్లైన కొత్తలో అన్యోనంగానే ఉన్న.. తరువాత ఆమెను భర్త పట్టించుకోవడం మానేశాడు. భర్త ప్రవర్తనలో మార్పును గమనించిన ఆమె.. అందుకు గల కారణం తెలుసుకుని షాకైంది. బసవరాజ్‌ తన వయసు కంటే పెద్దదైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఎక్కువ సమయం ఆమెతోనే గడిపేవాడు. ఈ విషయం తెలుసుకున్న లేఖన తనను ఎందుకు మోసం చేస్తున్నావని నిలదీసింది. దీంతో మరింత రెచ్చిపోయిన అతడు.. నా ఇష్టం వచ్చినట్లు ఉంటా.. నీతో కాపురం చేయాలంటే.. మరింత కట్నం తీసుకొని రావాలంటూ లేఖను వేదించాడు.

రోజు రోజుకు భర్త వేదింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయిన లేఖన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దంపతులను ఇద్దరిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించాడు. తర్వాత కూడా బసవరాజ్‌ పద్దతి మార్చుకోకపోగా.. ప్రియురాలితోనే ఎక్కువ సమయం గడిపేవాడు. దీంతో లేఖన తట్టుకోలేకపోయింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.