ప్రైవేటు పాఠశాలల కీలన నిర్ణయం‌: స్కూల్‌ ఫీజులో 25 శాతం తగ్గింపు!

By సుభాష్  Published on  1 Oct 2020 3:34 AM GMT
ప్రైవేటు పాఠశాలల కీలన నిర్ణయం‌: స్కూల్‌ ఫీజులో 25 శాతం తగ్గింపు!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలన్నీమూతపడ్డాయి. విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని నష్టపోకుండా ఇప్పటికే ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగుతున్నాయి. అయితే ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు భారీగా ఫీజులు దండుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్సుల ఫీజుల్లో 25 శాతం తగ్గించడానికి అంగీకరించినట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి భూపేంద్రసిన్హా తెలిపారు.

కరోనా కారణంగా ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ పాఠశాల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోవడం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాల యాజమాన్యాలు 2020-2021 విద్యా సంవత్సరానికి గానూ ఫీజుల రాయితీని అంగీకరించాయని ఆయన తెలిపారు. ఈ మేరకు పాఠశాల యాజమాన్యాలతో విద్యాశాఖ పలు మార్లు చర్చలు జరిపినట్లు ఆయన వెల్లడించారు. ఈ తగ్గింపు సీబీఎస్‌ఐ పాఠశాలల్లోనూ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. మరో వైపు ప్రైవేటు పాఠశాలలు 30 శాతం మేర ఫీజులు తగ్గించాలని ఒడిశా విద్యాశాఖ అక్కడి యాజమాన్యాలను కోరింది. దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Next Story