తెలంగాణలో కొత్త‌గా 21 కరోనా పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 May 2020 4:02 PM GMT
తెలంగాణలో కొత్త‌గా 21 కరోనా పాజిటివ్‌ కేసులు

క‌రోనా మ‌హ‌మ్మారి రాష్ట్రంలో విజృంభిస్తుంది. రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో 21 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైయ్యాయి. వీటితో క‌లిపి రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1082కి చేరింది. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 29 మంది మృతి చెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల్లో 545 మంది ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి కాగ‌డా.. 508 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ రోజు న‌మోదైన కేసుల్లో జీహెచ్ఎంసీలో 20 కేసులు న‌మోదు కాగా.. జ‌గిత్యాల జిల్లాలో ఒక కేసు న‌మోదైంది. ఇప్ప‌టి వ‌ర‌కు యాద్రాది భువ‌న‌గిరి, వ‌న‌ప‌ర్తి, వ‌రంగ‌ల్ (రూర‌ల్‌) జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు న‌మోదు కాలేదు.

Next Story