2019లో సినీ లోకాన్ని విడిచి వెళ్లిన తారలు వీరే..
By సుభాష్ Published on 25 Dec 2019 6:49 PM IST
టాలీవుడ్‌లో ఎందరో తమ తమ నటన ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ప్రముఖల మరణం సినీ ఇండస్ట్రీలో తీరని లోటుగా మిగిలింది. ఇక టాలీవుడ్‌లో మనల్ని విడిచి దూరమైన వారు...
విజయ బాపినీడు:
ప్రముఖ సినీ దర్శక, నిర్మాత విజయ బాపినీడు ఈ సంవత్సరం మరణించారు. కొన్ని రోజులుగా ఆరోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఫిబ్రవరి 12వ తేదీన కన్నుమూశారు. మెగాస్టార్‌తో ఆయన మంచి సంబంధాలున్నాయి. చిరంజీవితో పట్నంతో వచ్చిన పతివ్రతలు, మగధీరుడు, ఖైదీనం.786, మగ మహరాజు, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ వంటి సినిమాలను ఆయన నిర్మించారు.
డీఎస్ దీక్షితులు:
రంగస్థల నటుడు డీఎస్ దీక్షితులు ఫిబ్రవరి 12న మృతి చెందారు. ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూశారు. మురారి సినిమాలో ఆయన చేసిన పూజారి పాత్రకు మంచిపేరే వచ్చింది. అలాగే ఇంద్ర, ఠాగూర్, అతడు చిత్రల్లో ఆయన నటించారు.
కోడి రామకృష్ణ:
సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోడి రామకృష్ణ. టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్నారు. కాగా, ఫిబ్రవరి 22న ఆయన కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన కిడ్ని వ్యాధితో బాధపడుతూ లోకానికి దూరమయ్యారు. ఇండస్ట్రీలో ఆయన మరణం తీరని లోటుగా మిగిల్చింది.
రాళ్లపల్లి:
సినీయ నటుడు రాళ్లపల్లి మే 17వ తేదీన మరణించారు. తెలుగు, తమిళంలో ఎన్నో వందల చిత్రాలు నటించిన ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరి వరకు కూడా ఆయన సేవలందించారు. ఆయన నటించిన మంచి చిత్రాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు, తమిళ సినిమాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
గిరీష్ కర్నాడ్:
ప్రముఖ నటుడు, సాహితీవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న గిరీష కర్నాడ్. ఆయన ఈ ఏడాది జూన్ 10న అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. కన్నడ వ్యక్తి అయినప్పటికీ తెలుగులోని ఎన్నోచిత్రాల్లో నటించారు.
విజయ నిర్మల:
నటి, దర్శకురాలు విజయ నిర్మల జూన్ 27న హఠాన్మరణం చెందారు. ఆమె సినిమాల్లో నటించడమే కాకుండా దాదాపు 50 సినిమాలకు దర్శకురాలు వహించి గిన్నీస్ బుక్‌లోకెక్కారు.
దేవదాస్ కనకాల:
బహుముఖ ప్రఙ్ఞశాలిగా పేరు తెచ్చుకున్న దేవదాస్ కనకాల ఆగస్టు 2న మరణించారు. రెండు సంవత్సరాల క్రితమే భార్య లక్ష్మీదేవి మరణించారు. ఆయన భార్య మరణించినప్పటి నుంచి దేవదాస్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన మరణంతో కనకాల కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయింది.
వేణు మాధవ్:
ప్రముఖ హస్యనటుడుగా ఎంతో పేరు తెచ్చుకున్న వేణుమాధవ్ సెప్టెంబర్ 25న అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్ది రోజులుగా వేణు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా, చివరికి ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఆయన మరణంతో టాలీవుడ్ లో తీరని లోటు మిగిలింది. ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన చేసిన కమెడి ప్రతి ఒక్కరిలో గుర్తిండిపోయింది.
గీతాంజలి రామకృష్ణ:
సీనియర్ నటి అయిన గీతాంజలి అక్టోబర్ 21న గుండెపోటుతు మరణించారు.దక్షిణాధి భాషలతో పాటు హిందీలోనూ ఎన్నో సినిమాల్లో నటించారు. ఆమె నటన ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్నారు.
గొల్లపూడి మారుతీరావు:
గొల్లపూడి మారుతిరావు.. ఈయన రచయితగా, నటుడిగా ఎన్నో సినిమాల్లోనటించి సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డిసెంబర్ 12న గొల్లపూడి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఎన్నో అవార్డులు, సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. ఆయన మృతి ఇండస్ట్రీలో తీరని లోటును మిగిల్చిందనే చెప్పాలి.