2019లో కాసుల వర్షం కురిపించిన తెలుగు సినిమాలివే..
By సుభాష్ Published on 28 Dec 2019 8:02 AM GMT
2019 సంవత్సరం ఇక ముగియబోతోంది. ఈ సంవత్సరంలో వచ్చిన తెలుగు సినిమాల్లోకొన్ని కాలసు వర్షం కురిపించాయి. భారీ కలెక్షన్లు రాబట్టగలిగాయి. ఏఏ సినిమాలకు ఎంత లాభం వచ్చిందే చూసేద్దాం..
'ఎఫ్ 2'
నటుడు వెంకటేష్, వరుణ్ తేజ్ లు కలిసి నటించిన చిత్రం ఎఫ్ 2. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పెద్ద హిట్టే అయింది. దాదాపు రూ.32 కోట్ల బిజినెస్ చేసి, 127 కోట్లకుపైగా గ్రాస్ సాధించింది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీ లాభాలే వచ్చాయి.
ఇస్మార్ట్ శంకర్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మూవీ స్మార్ట్ శంకర్. ఈ సినిమాతో పూరి 20 కోట్ల వరకు బిజినెస్ చేసి న సినిమా, 60 కోట్ల గ్రాస్ సాధించింది. మొత్తం మీద ఈ సినిమాకు మంచి లాభాలే వచ్చాయని తెలుస్తోంది.
ఓ బేబీ
పెళ్లి తరువాత లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టి పెట్టిన సమంత ఈ ఏడాది సూపర్ హిట్ కొట్టేసింది. ఓ బేబీ సినిమాతో మంచి విజయం సాధించింది. దాదాపు పది కోట్ల ప్రీ బిజినెస్ మాత్రమే చేసి డబుల్ రిటర్న్స్ సాధించింది.
మజిలి
నాగచైతన్య, సమంతలు రీల్ లైఫ్‌లో భార్యభర్తలుగానటించిన చిత్రం మజిలి.నిన్ను కోరి ఫేం శివా నిర్వహణలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించిందనే చెప్పాలి. దాదాపు రూ.22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి మిజిలి 65 కోట్లు వసూలు సాధించింది. దాదాపు 37 కోట్ల షేర్ సాధించింది.
అర్జున్ సురవం
అర్జున్ సురవరం. విడుదల ఆలస్యమైనప్పటికి మంచి కలెక్షన్ వచ్చిందనే చెప్పాలి. నిఖిల్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. తమిళ మూవీ కనితన్‌కు రీమేక్ గా ఈ చిత్రాన్నినిర్మించారు. ఈ సినిమా ఆలస్యం కావటం పెద్దగా అంచనాలు లేకపోవటంతో ఈ సినిమాకు 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ రాబట్టగలిగింది. సినిమాపై మంచి ఆదరణ రావడంతో భారీ వసూళ్లు రాబట్టింది.
రాజుగారి గది-3
ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్‌బాబు నటుడిగా తెరకెక్కిన సినిమా రాజుగారిగది 3. ఈ సినిమా రూ. 6 కోట్ల ప్రీ రిలీజ్ వ్యాపారం జరిగింది. మొత్తం మీద రూ.7 కోట్లు వసూలు రాబట్టి మంచి హిట్ కొట్టేసింది.
'ఎవరు'
చిన్న సినిమాగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 'ఎవరు'. విభిన్న సినిమాలతో ఆకట్టుకుంటున్న హీరో అడివి శేష్ ఈ ఏడాది డిఫరెంట్ మూవీతో మంచి విజయం సాధించాడు. వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. రూ.21 కోట్లకుపైగా గ్రాస్ సాధించి, రూ.11 కోట్ల షేర్‌తో మంచి హిట్ సాధించింది.
చిత్రలహరి
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ఏడాది విజయంలో ఉన్నాడు. 2018లోవరుస ప్లాప్‌లతో ఇబ్బంది పడ్డ సాయి ధరమ్ తేజ్ కమర్షియల్ ఫార్మాట్‌ను పక్కకు నెట్టేసి లవ్ స్టోరీతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కిశోర్ దర్శకత్వంలో నిర్మితమైన 'చిత్రలహరి' ఈ సినిమా దాదాపు రూ.14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. లాభాలు పెద్దగా లాభాలు సాధించలేకపోయినా నిర్మాతకు, డిస్ట్రీబ్యూటర్లకు ఎంతోకొంత లాభాలు తెచ్చిపెట్టాయి.
118 హిట్టిచ్చింది
నందమూరి కళ్యాణ్‌రామ్‌కు ఈ ఏడాది కలిసొచ్చిందనే చెప్పాలి. వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న కళ్యాణ్‌రామ్‌కు 118 సినిమాతో మంచి హిట్ కొట్టేశాడు. సినిమాటోగ్రాఫర్ దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ మంచి లాభాలే తెచ్చిపెట్టింది. ఈ సినిమా దాదాపు రూ. 10 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా, మొత్తంగా చూసుకుంటే సినిమాకు పెట్టిన పెట్టుబడులు వసూలు చేసి నిర్మాతలను సెఃఉఓన్‌లో ఉంచిందనే చెప్పాలి.
జెర్సీ
యంగ్ హీరో నాని హీరోగా తెరకెక్కిన మూవీ జెర్సీ. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా నాని క్రికెట్ క్రీడాకారుడుగా అవతారమెత్తాడు. ఈ సినిమాకు రూ. 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ రాగా, మొత్తంగా చూసుకుంటే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను సెఫ్ జోన్‌లో ఉంచింది. దాదాపు 28కోట్ల వరకు వసూళ్లను రాబట్టగలిగింది.
గద్దలకొండ గణేష్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన మూవీ గద్దలకొండ గణేష్. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మంచి విజయం సాధించిందనే చెప్పాలి. ఈ మూవీ టైటిల్ విషయంలో విడుదలకు ముందు కొన్ని వివాదాలు చూట్టుముట్టాయి. చివరి నిమిషంలో టైటిల్ మార్పు చేయాల్సి వచ్చింది. టైటిల్ మార్పు చేసినా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు ఫిదా అయ్యారు. దాదాపు రూ. 25 కోట్ల బిజినెస్ చేసి మొత్తం మీద సేఫ్ ప్రాజెక్టు అనిపించింది.
మహర్షి
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మూవీ 'మహర్షి' పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రైతుల సమస్యలపై చిత్రీకరించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాభారీ వసూళ్లు రాబట్టగలిగింది. దిల్‌రాజ్, పవీపీ,మహేష్ బాబు, అశ్వనీదత్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నష్టాల్లో నెట్టకుండా చూసుకోగలిగింది.
ప్రతిరోజూ పండగే
ఈ సంవత్సరం సూపర్ హిట్ జాబితాలో చేరిన మరో సినిమా 'ప్రతిరోజూ పండగే' చిత్రలహరి మూవీతో సక్సెస్‌లో ఉన్న సాయిధరమ్ తేజ్ ఈ సినిమాతో మంచి హిట్ సంపాదించాడు. ఈ సినిమా భారీ వసూళ్లు వచ్చాయనే చెప్పాలి. మొత్తం మీద ఈ సినిమా మంచి వసూళ్లే రాబట్టిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.