భారత్‌లో 24గంటల్లో 16,992కేసులు.. 418 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2020 5:05 AM GMT
భారత్‌లో 24గంటల్లో 16,992కేసులు.. 418 మంది మృతి

భారత్‌లో శరవేగంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకి రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 16,992 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 418 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఒక్క రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసులు ఇవే. వీటితో కలిపి భారత్‌లో 4,73,105 కి కేసుల సంఖ్య చేరింది. ఈ మహమ్మారి బారిన పడి 14,894 మంది మరణించారు.

మొత్తం నమోదు అయిన కేసుల్లో 2,71,697 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 1,86,514 మంది వివిధ ఆస్పత్రుల్లో చికత్స పొందుతున్నారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 10వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న నగరాల్లో లాక్‌డౌన్‌ను ప్రకటిస్తున్నారు. కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

Next Story