దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు ఎక్కడికక్కడే ఉండిపోయారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వారిని స్వస్థలాలకు పంపించేందుకు నిర్ణయం తీసుకోగా, వారి కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు పంపిచేందుకు ఏర్పాట్లు చేసింది కేంద్రం.

వారి కోసం శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని సూరత్‌ నుంచి వలస కార్మికులను ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు తరలించారు. ఇక రైలులో 167 మంది వలస కార్మికులు అదృశ్యమయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 1,340 మంది వలస కార్మికులతో మే 12వ తేదీన సూరత్‌ నుంచి హరిద్వార్‌కు ప్రత్యేక రైలు చేరుకునే సరికి అందులో 1173 మంది మాత్రమే ఉన్నారు.
మిగతా కూలీలు లేకపోవడంతో అధికారుల్లో టెన్షన్‌ మొదలైంది. కనిపించకుండా పోయిన ఆ కూలీలు రైలు వెళ్లే ముందు అందులోనే ఉన్నారా….? లేక మధ్యలో ఎక్కడైన దిగి వెళ్లిపోయారా అనేది విషయంపై ఆరా తీస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *