తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో 15 కేసులు న‌మోదు అయ్యాయి. వీటితో క‌లిపి రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1122 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 29 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల్లో 693 మంది డిశ్చార్జి కాగా.. 400 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో 12 జీహెచ్ఎంసీ ప‌రిధిలోనివే కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రంగ‌ల్‌(రూర‌ల్), యాదాద్రి భువ‌న‌గిరి, వ‌న‌ప‌ర్తి జిల్లాలో ఒక్క క‌రోనా పాజిటివ్ కేసులు కూడా న‌మోదు కాలేదు.

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుండ‌డంతో తెలంగాణ‌లో మే 29 వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగించిన సంగ‌తి తెలిసిందే. ఇక గ్రీన్‌, ఆరెంజ్ జోన్ల‌ల‌లో కొన్ని స‌డ‌లింపులు ఇచ్చారు.

Untitled 6

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *