కరోనా కోరలు చాస్తుండటంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులు, ఇతరులు ఎక్కడికక్కడ చిక్కుకుపోవడంతో సొంతూళ్లకు వెళ్లలేక నానా అవస్థలకు గురయ్యారు.

ఈ సమయంలో కర్ణాటకలోని చెళ్లికెరలో ఉన్న ఓ వలసకూలీ నిండు గర్భిణి సలోని కుటుంబ సభ్యులతో కలిసి స్వస్థలమైన ప్రకాశం జిల్లా పొదిలికి కాలినడకన బయలుదేరింది. ఈమె ఏకంగా 130 కిలోమీటర్ల దూరం కాలినడకన నడిచిన తరర్డివాత తీవ్ర అస్వస్థలకు గురికావడంతో అనంతపురం పోలీసులు గమనించి ఆమెకు వసతి కల్పించారు. అంతేకాదు గర్భిణి సలోని చేతిలో రెండేళ్ల పాప కూడా ఉంది.

విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఉద్యోగి పద్మావతి వారికి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు. ఆ వాహనానికి ఈ-పాస్‌ అనుమతి జారీచేసి పొదిలికి తరలించారు.

ఇక ఇలాంటి సమయంలో ఓ నిండు గర్భిణి అలా కాలినడకన బయలుదేరిన గర్భిణికి పోలీసులు సాయం అందించారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులను కూడా సొంతూరుకు తరలించారు. లాక్‌డౌన్‌ వేళ విధులు నిర్వర్తించడమే కాకుండా అవసరమైన సాయం అందించి మానవత్వం చాటుకున్నారు.

సుభాష్

.

Next Story