నేటి నుంచి లాక్‌డౌన్‌ 3.0.. సడలింపులు ఇవే..

By సుభాష్  Published on  4 May 2020 4:42 AM GMT
నేటి నుంచి లాక్‌డౌన్‌ 3.0.. సడలింపులు ఇవే..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. ఇక కొనసాగుతున్న లాక్‌డౌన్‌ నిన్నటితో ముగిసింది. ఇక మే 4వ తేదీ నుంచి పొడిగించిన లాక్‌డౌన్‌ మే 17వ వరకూ కొనసాగనుంది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మూడో దశ లాక్‌డౌన్‌ను పొడిగించింది.

అయితే మూడో దశ లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. జోన్ల కేంద్రంలో సడలింపులు ఇస్తూ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింఇ. ముఖ్యంగా కరోనా తీవ్రంగా ఉన్న రెడ్‌ జోన్‌లలో సైతం ఎలాంటి నిబంధనలు సడలించలేదు. నిబంధనలు మరింత కఠితరం చేస్తూ ప్రకటించింది.

గ్రీజోన్, ఆరెంజ్‌ జోన్‌ ప్రాంతాల్లో 50శాతం బస్సులు తిరిగేందుకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు వ్యక్తిగత వాహనాలకు అనుమతి ఇచ్చింది. కార్లలో మాత్రం ఇద్దరు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించింది. ఆరేంజ్‌, గ్రీన్‌జోన్‌లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.

విమానాలు, రైళ్లు, అంతర్జాతీయ ప్రయాణాలపై ఎలాంటి సడలింపులు ఉండవు. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు, సినిమా హాళ్లు, హోటళ్లు, జీమ్‌లు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, స్టేడియంలు మూసి ఉండనున్నాయి. అంతేకాదు.. గ్రీన్‌ జోన్‌లలో మద్యం షాపులు, పాన్‌ షాపులు నడిపేందుకు అనుమతి కూడా ఇచ్చింది.

మాల్స్‌, అందుబాటులు ఉండే షాపులకు ఎలాంటి అనుమతి లేదు. సింగిల్ విండో షాపులు, కాలనీల్లో ఉండే షాపులు, గృహ సముదాయాల్లో ఉండే షాపులకు మాత్రమే అనుమతి ఉంది. అంతేకాదు నిబంధనలు సడలించిన ప్రాంతాల్లో సోషల్‌ డిస్టెన్స్‌ తప్పని సరి.

Next Story