కరోనా వల్ల సినిమా షూటింగ్స్‌ వాయిదా పడిన వర్మ మాత్రం వరుస పెట్టి సినిమాలు రిలీజ్‌ చేస్తున్నాడు. వర్మ ఎప్పుడు సినిమా స్టార్ట్‌ చేస్తాడో.. ఎప్పుడు కంప్లీట్‌ చేస్తాడో ఎవ్వరికి తెలీదు. సినిమాలో విషయం ఉందో లేదో పక్కన బెడితే.. సినిమాకి మంచి హైప్‌ను క్రియేట్‌ చేస్తాడు వర్మ. ఇప్పటికే అర డజన్‌పైగా సినిమాలను అనౌన్స్‌ చేసిన వర్మ.. అందులో ‘క్లైమాక్స్‌’, ‘నగ్నం’ వంటి సినిమాలను రిలీజ్‌ కూడా చేశాడు. ఈ సినిమాలను తన ప్రత్యేకమైన యాప్ ద్వారా ఆన్ లైన్ లో ‘పే ఫర్ వ్యూ’ విధానంలో విడుదల చేశాడు. వీటిని తక్కువ ఖర్చుతో నిర్మించి, ఎక్కువ లాభాలను పొందుతున్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అప్పుడెప్పుడో ‘రాత్రి’, ‘భూత్’‌ సినిమాలతో భయపెట్టిన వర్మ తాజాగా ’12 ఓ క్లాక్’ (12 O’ CLOCK) సినిమాతో భయపెట్టడానికి వస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశాడు. ఈ సినిమా షార్ట్‌ పిల్మ్‌కాదని, 1 గంట 45 నిమిషాలు ఉండే పుల్‌ లెన్త్‌ మూవీ అని చెప్పుకొచ్చాడు. ఇక టీజర్‌‌ చూస్తుంటే కొంచెం భయపెట్టే ప్రయత్నం అయితే చేశాడనిపిస్తోంది. సైన్స్‌కు, ఆత్మలకు ఏదైనా సంబంధం ఉందా అనే అంశాన్ని ముడిపెడుతూ ఒక్క డైలాగ్‌ కూడా లేకుండా కేవలం హావభావాలతోనే ఆసక్తిగా చూపించారు.రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి చాలా కాలం తరువాత ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం.ఈ సినిమాలో దండుపాళ్యం ఫేమ్‌ మకర్‌దేశ్‌ పాండే, మిథున్‌ చక్రవర్తి, ఆశిష్‌ విద్యార్థి, దిలీప్‌ తాహిల్‌, మానవ్‌ కౌల్‌, అలీ అజగర్‌, కొత్త నటుడు కృష్ట గౌతమ్‌ తదితరులు నటించారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort