12 మందిని జీవిత ఖైదీలుగా మార్చిన 'మూఢనమ్మకం'..కోర్టు సంచలన తీర్పు

By సుభాష్  Published on  29 Dec 2019 3:30 AM GMT
12 మందిని జీవిత ఖైదీలుగా మార్చిన మూఢనమ్మకం..కోర్టు సంచలన తీర్పు

ఇంతటి సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్నా..ఇంకా కొందరు మూఢనమ్మకాలను నమ్ముతూ తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రపంచం సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ కొత్తపుంతలు తొక్కుతుంటే మూఢనమ్మకాలను నమ్ముతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బాణామతులు చేస్తున్నారని ఇద్దరి దంపతులను హత్య చేసిన నిందితులను జీవితాంతం జైలు జీవితం గడిపేలా చేసింది. ఆ మూఢనమ్మకం వారి ప్రాణాల మీదకు తెచ్చింది. మూఢనమ్మకంతో వారు కృరంగా ప్రవర్తించారు. బాణామతి, చేతబడులు ఉన్నాయన్న అనుమానంతో ఇద్దరిని అతిదారుణంగా హతమార్చారు. ఏపీలోని విజయనగరం జిల్లా జిల్లా మక్కువ మండలం ఎన్ పెద్దవలస పంచాయతీలోని కేకే వలస గ్రామానికి చెందిన 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ బొబ్బిలి రెండో అదనపు కోర్టు జడ్జి శ్రీనివాస్ రావు సంచలన తీర్పునిచ్చారు. ఈ తీర్పు కలకలం సృష్టించింది. న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుతో వారంతా జీవిత ఖైదులుగా మారిపోయారు. కోర్టు లైజనింగ్ అధికారి షర్ముఖరావు వివరించిన వివరాల ప్రకారం..

కేకే వలసలో నివసిస్తున్న జన్ని శ్రీను కాలుకు దెబ్బతగిలి అనారోగ్యం బారిన పడ్డాడు. 2016, జనవరిలో ఆయన మృతి చెందాడు. ఆయన మృతికి గ్రామంలో ఉన్న గొల్లూరి పండు, సీతమ్మల చేతబడులే కారణమని గ్రామస్తులు మరుసటి రోజే గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి, గ్రామానికి చెందిన కొందరు పండు, సీతమ్మలను రాళ్లతో కొడుతూ చితకబాదుతూ ఈడ్చుకుంటుపోయారు. వారికి కొన ఊపిరి ఉండగానే దహనం చేశారు. అదే రోజు రాత్రి భస్మాలను, మిగిలిన ఎముకలను కనిపించకుండా జాగ్రత్తలు పడ్డారు. వీరి మరణంపై అనుమానం వచ్చిన వారి రెండో కుమార్తె సూరమ్మ మక్కువ పోలీసుస్టేషన్ లో జనవరి 13న ఫిర్యాదు చేసింది. తమ తల్లిదండ్రులను సజీవంగా దహనం చేశారని పోలీసుల ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే సాలూరు సీఐ రామకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని విచారించి సాక్ష్యాధారాలను సేకరించడంతో పాటు పలు కీలక విషయాలను గుర్తించారు. పండు, సీతమ్మల హత్యకు కారణమైన అదే గ్రామానికి చెందిన 13 మందిపై కేసు నమోదు చేసి వివరాలు కోర్టుకు అందజేశారు. కాగా, గ్రామంలో ఓ వ్యక్తి ఈ హత్యకు సంబంధించిన ఉదాంతాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. పోలీసులు దానిని సాక్ష్యంగా చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఈ వీడియోను చూసిన న్యాయమూర్తి పలుమార్లు స్వయంగా పరిశీలించారు న్యాయమూర్తి

12 మందికి జీవిత ఖైదు

ఈ కేసుపై పలు మార్లు విచారణ జరగగా, చివరగా ఈ శుక్రవారం బొబ్బిలి రెండో అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి శ్రీనివాసరావు ఐసీపీ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తూ, 12 మంది నిందితులను నేరస్తులుగా పరిగణించి బతికి ఉన్నన్ని రోజులు కఠిన శిక్ష అనుభవించాలని తీర్పు వెల్లడించారు. ఇక నిందితుల్లో ఒకరైన గొల్లూరి అర్జున్ ఈ నేరం చేయవద్దని మిగతా వారిని వారించినట్లు విచారణ తేలడంతో ఆయనను నిర్దోషిగా తేల్చింది కోర్టు.

ఒక్కొక్కరికి రూ. 2600 జరిమానా..

ఈ కేసులో దోషులుగా తేలిన ఒక్కొక్కరికి రూ. 2600 జరిమానా విధించారు న్యాయమూర్తి. అలాగే హత్యకు గురైన పండు, సీతమ్మల కుమార్తెలకు రూ. 5 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని జిల్లా న్యాయ సలహా సంఘం సిఫార్సు చేసింది. అలాగే ఒక్కొక్కరికీ రూ.2,600 జరిమానా విధించారు. ఫిర్యాదు దారయిన గొల్లూరి పండు, సీతమ్మల కుమార్తెకు రూ.5లక్షల పరిహారాన్ని చెల్లించాలని జిల్లా న్యాయ సలహా సంఘానికి సిఫార్సు చేశారు

జీవిత ఖైదు అనుభవించే నిందితులు వీరే..

ఇక కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవించే నిందితులు పాలిక వెంకటరావు, జన్ని గంగరాజు, జన్ని గోవింద, పాలిక చంద్రరావు, జన్ని ధర్మారావు, పాలిక తిరుపతి,పాలిక జోగులు, జన్ని సన్యాశిరావు, జన్ని ముకుంద, పాకలి జగ్గులు, అప్పలస్వామి, మల్లన్నలు ఉన్నారు. దోషులగా తేలిన వారిని పోలీసు భద్రత మధ్య జైలుకు తరలించారు.

Next Story