వాడొక నరహంతకుడు..17 మంది మహిళలను పొట్టనబెట్టుకున్నాడు

By సుభాష్  Published on  28 Dec 2019 4:58 AM GMT
వాడొక నరహంతకుడు..17 మంది మహిళలను పొట్టనబెట్టుకున్నాడు

ముఖ్యాంశాలు

  • ఒంటరి మహిళలే ఇతని టార్గెట్‌

  • మద్యం తాగిస్తాడు.. మట్టుబెడతాడు

ఒకనొక నరహంతకుడు, మహిళలే అతని టార్గెట్‌, మద్యం తాగే మహిళలను లక్ష్యంగా చేసుకుంటూ మట్టుబెడుతుంటాడు. ఎన్నోకేసుల్లో జైలు జీవితం అనుభవించినా అతనిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. సొంత తమ్ముడితో హత్య చేశాడంటే అతను ఎంత కిల్లరో ఇట్టే అర్థమైపోతుంది. ఇటీవల ఓ మహిళ హత్య కేసులోపోలీసులకు చిక్కాడు. తెలంగాణలోని మహబూబ్‌ నగర్‌ జిల్లా బాలనగర్‌ మండలం గుండేడ్‌ గ్రామానికి చెందిన ఎరుకల శ్రీను ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటలా పాలయ్యాడు. ఇతని దారుణాలు చూస్తే ఖంగుతినాల్సిందే. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రెమా రాజేశ్వరి నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు.

అదే జిల్లాకు చెందిన నవాబుపేట మండలానికి చెందిన అలివేలమ్మ (53) మృతదేహాన్ని ఈనెల 17వ తేదీన పోలీసులు గుర్తించారు. క్లూస్‌ టీం ఆధారంగా ఆమెది ముమ్మాటికి హత్యేనని నిర్దారించారు. ఇందులోఎరుకల శ్రీను పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇది హత్య తానే చేసినట్లు కూడా శ్రీనివాస్‌ అంగీకరించాడు. 2018 ఆగస్టునెలలోజైలు కెళ్లిన తిగిరి వచ్చిన తర్వాత నిందితుడు శ్రీనివాస్‌ మరో నలుగు హత్య చేసినట్లు వెల్లడించాడు. దేవరకద్రి, కొత్తకోట, మిడ్జిల్‌, అలాగే భూత్పూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ హత్య చేసినట్లు గుర్తించారు. కాగా, ఇటీవల రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో డీఎండీసీ ఇసుక యార్డులో ఓ మహిళ ఎముకల గూడు బయటపడింది. ఇది కూడా శ్రీను పనేనని గుర్తించారు. 2007లో తన సొంత తమ్ముడిని హత్య చేసి జైలుకెళ్లాడు. తర్వాత మూడు సంవత్సరాల్లో బయటకు వచ్చాడు. పలు ప్రాంతాల్లో మహిళలను హత్య చేసినట్లు కూడా తెలుస్తోంది. 2018 నుంచి నమోదైన కేసులు 4 కాగా, పాతవి 14 ఉన్నాయి. వీటిలో 17 హత్యలు ఉన్నాయి.

2

ఒంటరి మహిళలే లక్ష్యం:

నిందితుడు ఒంటరిగా వెళ్లే మహిళలను హత్య చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈనెలలో 16న మహబూబ్‌నగర్‌లో ఓ కల్లు దుకాణానికి వెళ్లిన ఓ మహిళతో మాటలు కలిపి, దేవరకద్రిలో ఓ వ్యక్తి తనకు రూ.20 ఇవ్వాలని, ఆ డబ్బులు ఇప్పిస్తే రూ.4వేలు ఇస్తానని ఆశచూపాడు. నమ్మిన ఆమె వెంటనే అతని బైక్‌పై వెళ్లింది. మార్గమధ్యంలో మద్యం తాగి ఆమెపై బలంగా ఛాతిపై కొట్టి, నేలకేసి బాదాడు. వెంటనే ఆమె మృతి చెందింది. ఆమెపై ఉన్న నగలను ఎత్తుకెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపగా, ఇది శ్రీను పనేనని తేలింది. వెంటనే అతన్ని అరెస్టు చేశారు పోలీసులు.

3

నిందితుడు శ్రీనుపై పీడీ చట్టం: ఎస్పీ

నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ రెమా రాజేశ్వరి ఇతనిపై పీడీ చట్టం నమోదు చేసినట్లు తెలిపారు. హంతకుడికి సహకరించిన అతని భార్య సాలమ్మనూ అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఎలాంటి ఘటనలపై మహిళలు చాలా జాగ్రత్త వహించాలని, ఎవరి మాటలు నమ్మకుండా ముందు జాగ్రత్త పాటించాలని సూచించారు. ఇలాంటి వాళ్ల మాటలు నమ్మే మహిళలు బలవుతున్నారని చెప్పారు. నిందితుడి నుంచి బంగారం, వెండి అభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Next Story
Share it