రాశి ఫలాలు : 11-10-2020 ఆదివారం నుండి 17-10-2020 శనివారం వరకు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2020 5:34 AM GMT
రాశి ఫలాలు : 11-10-2020 ఆదివారం నుండి 17-10-2020 శనివారం వరకు

*విశేష దినములు*

11-10 -2020 ఆదివారం పుష్యమి నక్షత్రం *పుష్యార్క* యోగం. ఉపాసకులకు మంచిది.

13-10- 2020 మంగళవారం అధిక ఆశ్వియుజ బహుళ ఏకాదశి.

15-10-2020 గురువారం మాస శివరాత్రి.

16-10-2020 శుక్రవారం అమావాస్య.

*నిజ ఆశ్వీయుజ మాస ప్రారంభము*

17-10-2020 శనివారం తులా సంక్రమణం, శరన్నవరాత్రప్రారంభం. (దేవీ నవరాత్రులు).

*తదుపరి వారం*

21-10-2020 బుధవారం *సరస్వతీ పూజ.* పుస్తకాల పూజ చేయవలెను

23-10-2020 సప్తమి శుక్రవారం దేవి త్రిరాత్ర వ్రతం ప్రారంభం.

24-10-2020 శనివారము దుర్గాష్టమి.

తే 25-10-2020 ఆదివారం మహర్నవమి, *విజయదశమి* కలిసిన మహా పర్వదినం శమీ(జమ్మి చెట్టు) పూజ, ఆయుధ పూజ, వాహనముల పూజ చేయవలెను.

మేష రాశి :- ఈ రాశి వారు శత్రు నాశనము ధనలాభము విశేష ధనము బంధువు యొక్క ఆదరాభిమానాలు పొందుతారు. 16వ తేదీ వరకూ రవి ప్రభావం మీకు బాగుంటుంది. 17వ తేదీన కన్యలో రవి ప్రవేశించగానే మీకు మీ ఆలోచనలకు ఆటంకాలు ఏర్పడి విచారాన్ని పొందుతారు. కుజ శనుల ప్రతికూలత మీకు కొన్ని పనులకు ఇబ్బంది కలిగించి రాజకీయపరమైన ఒత్తిళ్లు కూడా మీకు పెరిగే అవకాశం ఉంటుంది. అకారణ కలహాలు రాహు కేతు ప్రభావం మీపై పనిచేస్తాయి. మీరు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది అయితే బుధ గురు శుక్రులు మీకు మంచి స్థితిలో ఉన్నారు కనుక వాళ్ళు మీకు చాలా చక్కగా ప్రతి పనిని చూసి పెట్టే ప్రయత్నంలో ఉంటారు. వారి వల్లనే ఇంట్లో వివాహప్రయత్నాలు జరుగుతాయి. అనుకూలమైన వాతావరణం కొంచెం ఏర్పడుతుంది. ఏదైనా పెద్దలు పిల్లల ఆరోగ్యం విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్త వహించండి. ఈ వారంలో ప్రతి రాశి వారికి కూడా ప్రతికూల పరిస్థితి ఎక్కువగా ఉంది. మనః కారకుడైన చంద్రుడు మీకు వారాంతంలో విశేష ధనం అందుకున్నట్లు చేస్తాడు. ఈ వారంలో మీరు 43% శుభఫలితాలను పొందగలుగుతారు. అశ్విని నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కాబట్టి పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి. భరణి నక్షత్ర జాతకులకు నైధన తార అయింది కాబట్టి పనులు వాయిదా పడతాయి. కృత్తిక ఒకటో పాదం వారికి సాధన తార అయింది కాబట్టి పనులు సానుకూలం అవుతాయి.

పరిహారం :- 13వ తేదీ మంగళవారం ఏకాదశి నాడు సుబ్రహ్మణ్య పూజ ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ విశేష ఫలితాన్ని ఇస్తాయి.

వృషభ రాశి :- ఈ రాశి వారికి శత్రు నాశనం ఆర్థిక ధనలాభము ఇవన్నీ కూడా వీళ్ళని ఆనందాన్ని కలిగించి ముందుకు నడిపిస్తూ ఉంటాయి. వీరికి రవి అనుకూలించడం చేత 17వ తేదీ నుంచి బాగుంటుంది. చంద్రుడు కుజ బుధ శుక్రులు కొంతవరకు ఆనందాన్ని కలిగిస్తారు. రవి కేతువులు ఒకరు శత్రు నాశనం చేస్తుంటే ఇంకో శత్రువు వృద్ధికి కారణమవుతున్నారు. అనుకున్న పనులు కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది. కుటుంబంలో మంగళప్రదమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఇంటికి కావలసినటువంటి కొన్ని హంగులు సమకూర్చుకుంటారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కొత్త వ్యక్తులు మీ కుటుంబం లోకి ప్రవేశించే అవకాశం కూడా ఉంది. స్థిరాస్తి వ్యవహారాలు కొంచెం జాగ్రత్త వహించండి. కొత్త వ్యాపారానికి పెద్ద అనుకూలమైన సమయం కాదు. విలువైన వస్తువుల సేకరణ చేసుకుంటారు. శని ప్రభావము మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. మీకు గురు అనుగ్రహం చాలా తక్కువగా ఉంది కాబట్టి జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ప్రతి దాన్ని మీరు కాగితం మీద పెట్టడం అలవాటు చేసుకోండి. మీరు ఈ వారంలో 43% శుభ ఫలితాన్ని పొందగలుగుతున్నారు. కృత్తిక 2 3 4 పాదాలు వారికి సాధన తార అయింది అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. రోహిణి నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది కాబట్టి పనులు కొంచెం వాయిదా పడతాయి. మృగశిర 1 2 పాదాలు వారికి క్షేమ తార అయింది కాబట్టి చాలా మంచి ఫలితాలను పొందగలుగుతారు.

పరిహారం :- శనికి జపం, నువ్వుల నూనె, నువ్వులు, నల్లని వస్త్రం దానం చేయడం చాలా అవసరం. గురువార నియమాలు పాటించి దత్తాత్రేయ స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం నిత్యం పఠిస్తూ ఉండండి.

మిధున రాశి: సంతోషము ధనలాభము ఈ రెండింటితో పాటు సుఖ జీవనం పొందగలుగుతారు. మీకు శుభాశుభ మిశ్రమంగా ఈ వారం ఉంటుంది. ఈ వారంలో అనారోగ్య హేతువు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆర్థికంగా ఇబ్బంది ఎక్కువ పడతారు. శని ప్రభావం చేత అనుకున్న పనులు కాకపోవడం అలాగే ఎందుకు జీవితమ్ అనే నిరాశ నిస్పృహ మీలో ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఒంటరితనాన్ని కుటుంబం నుంచి దూరంగా ఉండాలని ఆలోచన ఎక్కువ చేస్తాడు, దాని నుండి మీరు విరమించుకుంటేనే బాగుపడతారు. ధైర్యం వహించండి. కుజ గురు శుక్రులు మీకు కొంతవరకు ధైర్య స్వావలంబన దిశగా మిమ్మల్ని నడిపిస్తారు. మీ ఆత్మ ధైర్యం మీలో ఎక్కువ చేసుకోవాలి. కేతువు సుఖ జీవితాన్ని ఇస్తాడు. కొన్నాళ్లపాటు ఈ పరిస్థితులు మీకు ఇలాగే ఉంటాయి. ముందుగానే జాగ్రత్త వహించడం కుటుంబ పరంగా మంచిదే. ఈ వారంలో మీకు 36 శాతం మాత్రమే శుభఫలితాలు ఉన్నాయి. మృగశిర 3 4 పాదాలు వారికి క్షేమ తార అయింది కాబట్టి చాలా చక్కని పరిస్థితులు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి ఆర్థిక ఇబ్బంది ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. పునర్వసు 1 2 3 పాదాలు వారికి సంపత్తార అయింది కాబట్టి ఆర్థిక పరిపుష్టి ఉంటుంది.

పరిహారం: అష్టమ శని కి జపం, నువ్వులు నూనె నల్లని వస్త్రములు దానం చేయడం బ్రాహ్మణులకు భోజనం పెట్టడం మంచిది. నాన్న వేసిన ప్రజలు బుధవారంనాడు బెల్లం వేసి ఆవుకి తినిపించండి.

కర్కాటక రాశి :- ఈ రాశి వారికి సంపద, శత్రు జయము, భూషణ అలంకారం, విశేష ధన లాభాలు చాలా ఆనందాన్ని ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. కుటుంబ సౌకర్యాన్ని పొందగలుగుతున్నారు. కుజుడు మీకు వాహనాలపై ప్రయాణం వల్ల ద్రవ్య హాని శారీరక ఇబ్బందులు కలిగిస్తాడు. బుధ ప్రభావం చేత మీకు పరిచయం పెరిగి కొత్త వ్యక్తుల ద్వారా కొత్త ధన అన్వేషణ మార్గాలు పెరుగుతాయి. మీ వృత్తి వ్యాపారానికి చక్కని గుర్తింపు లభిస్తుంది. నైపుణ్యతను ఉపయోగించుకుని ముందుకు సాగుతారు. కొంత గురు ప్రభావం తక్కువగా ఉంది కాబట్టి మాటలు తక్కువగా పని ఎక్కువగా చేసి ఆలోచనను మంచిగా చేసినట్లయితే మీకు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో ఎదురు లేదు. రాహు అనుకూలత ఉంది కనుక మీరు ఎంత వీలైతే అంత ధనాన్ని సేకరించి స్థిరాస్తిగా మార్చండి. మీకు ఈ వారంలో 43% శుభ ఫలితాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారికి సంపత్తార అయింది కాబట్టి చక్కని ధనప్రాప్తి ఉంది. పుష్యమి నక్షత్ర జాతకులకు జన్మతార అయింది ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోండి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది కాబట్టి మంచి పరిచయాలతో పాటు ఆర్థిక పరిపుష్టిని పొందగలుగుతారు.

పరిహారం :- శని మంత్ర జపం చేసుకోండి. హయగ్రీవ స్తోత్రం, గురు మంత్రజపం, లేదా నిరంతరము గురువు గారి దర్శనం మీకు శుభ ఫలితాలనిస్తాయి.

సింహ రాశి: ఈ రాశి వారికి సంపదలు, స్వర్ణాకర్షణ ప్రాప్తి, శరీర సౌఖ్యము, విశేష ధన ఆదాయాన్ని చేకూర్చి మాటకు తిరుగు లేదు అన్నట్టుగా అనిపిస్తాయి కానీ అనుకున్నంత సౌఖ్యంగా ఈవారం మీకు ముందుకు నడవడం లేదు. రవి ఊహించని భయాన్ని కలిగిస్తాడు. కుజ స్థితి బాగులేదు శస్త్రచికిత్స వరకు వెళ్ళవలసి వస్తుంది. అందుకనే వాదనలపై ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. బుధ గ్రహస్థితి కూడా బాగోలేదు. శత్రువులు మీపై ఒత్తిడిని కలుగజేస్తారు. ఏదో ఒక దగ్గర మిమ్మల్ని మభ్యపెట్టి మీ ద్వారా మీ యొక్క ఆస్తులను చేజిక్కించుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా గురుడు మీకు ఆలోచనలు ఇస్తాడు ఆలోచనలు సకాలంలో వినియోగించుకోండి. బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఎన్ని చూసినా ఎన్ని చేసినా మీకు ఒంటరితనం మా గౌరవ భంగం వారాంతంలో కనిపిస్తోంది. పాతబాకీలు వసూలవుతాయి దానికి మంచి రోజులు వస్తాయి ఈ వారంలో మీరు 43% శుభఫలితాలు పొందే అవకాశం ఉన్నది. మఖా నక్షత్ర జాతకులకు మిత్రతార శుభఫలితాలు ఎక్కువగా ఉంటాయి. పుబ్బ నక్షత్ర జాతకులకు నైధనతార కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తర 1వ పాదం వారికి సాధన తార అయింది కాబట్టి అనుకున్న పనులు నెరవేరుతాయి.

పరిహారం :- 13వ తేదీ మంగళవారం ఏకాదశి ఉపవాసం చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, ఆంజనేయ స్వామి పూజ మీకు శుభ ఫలితాలనిస్తాయి.

కన్యా రాశి :- ఈ రాశి వారికి స్వర్ణవర్ణ ప్రాప్తి, కుటుంబంతో కలిసి ఉండటం బంధుమిత్రులతో భోజనాదులు, ఆర్థిక లాభాలు వీళ్ళని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తాయి. చేస్తున్న పనులలో చిన్న చిన్న విఘ్నాలు ఏర్పడడానికి కారణం కొండెక్కి కూర్చున్నాడు. మీకు అనుకూలిస్తాయి గురు అనుగ్రహం చాలా తక్కువగా ఉంది తద్వారా ధన నష్టం కూడా ఎక్కువగా ఉంది. మీరు గురు అనుగ్రహం కోసం ప్రయత్నం చేయండి. పిల్లల పెద్దల ఆరోగ్యానికి జాగ్రత్తగా చూస్తూ ఉండండి. మీ ఉత్సాహం మీలోనే ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ మీరు ఆనందాన్ని పొందగలుగుతారు. స్వతంత్ర భావాలు మీలో పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా వాటిని తెలివితేటలతో ధైర్యంగా దాటేసే అవకాశం ఉంది. మీరంటే కొందరిలో శత్రు భావం పెరుగుతోంది. దాన్ని అధిగమించడానికి మీరు మంచి ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మీ నైపుణ్యాన్ని మీరు బయట పెట్టినట్లు అయితే మీ పనులు చాలా వరకు మంచిగా నెరవేరుతాయి. ఈ వారంలో మీకు ఆర్ధిక పరిపుష్టి కూడా కొంతవరకు ఉంది. మీకు ఈ వారంలో 36 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. ఉత్తర 2 3 4 పాదాలు వారికి సాధన తారయింది పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. హస్తా నక్షత్రం జాతకులకు ప్రత్యక్ తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. చిత్త 1 2 పాదాలు వారికి క్షేమ తార అయింది కాబట్టి కుటుంబ అనుకూలత బాగుంటుంది.

పరిహారం :- సూర్య నమస్కారాలు చేయండి. మూడో తేదీ ఏకాదశి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య పూజ, గణపతి పూజ, హనుమాన్ చాలీసా పారాయణ శుభ ఫలితాలనిస్తాయి.

తులా రాశి :- ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యము, ఆర్థిక పరిపుష్టి కొంతవరకు అనుకూల వాతావరణంతో వారం గడుస్తుంది. ఇంటా బయట మనశ్శాంతి లేకపో వడం వల్ల కొంచెం ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. రవిచంద్ర ఇద్దరు ప్రతికూలంగా కాబట్టి వీరు అనుక్షణం ఏదో ఒక భయాన్ని పొందుతూ ఉంటారు. కుజ శుక్రులు వీరికి అనుకూలంగా ఉండటం వల్ల ఈ వారంలో వీరు ఎక్కువ ధనాన్ని సంపాదించుకుని ఆనందాన్ని పొందగలుగుతారు. బుధ ప్రతికూలత వల్ల వ్యాపార వ్యవహారాల విషయంలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. గురుని ప్రతికూల వల్ల ఎక్కువగా సమయానికి అనుకున్న పనులు చేసుకోలేకపోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఉదర సంబంధమైన వ్యాధులు సూచిస్తున్నాడు శని. కాబట్టి ఆరోగ్య విషయాలను కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు దూరప్రాంతాలకు ప్రయాణం చేయవలసి వచ్చినట్లయితే పనులు వాయిదా వేయకుండా ఎవరికైనా అప్పజెప్పి ఇంటి భద్రత కూడా చూసి ముందుకు వెళ్ళండి. మాట పట్టింపులు మీకు కొంత ఇబ్బందిని ఇస్తాయి. ఈ వారంలో మీరు ఏ పని సాధించే అవకాశాలు లేవు కాబట్టి వీటిని జాగ్రత్తగా సమయం కోసం ఎదురు చూసి నిర్వహించు కోండి. ఈ వారంలో 29శాతం మాత్రమే శుభ ఫలితాలు మీకు ఉన్నాయి. చిత్త 3 4 పాదాలు వారికి క్షేమ తార అయింది కాబట్టి అనుకూలంగా ఉంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువ. విశాఖ 1 2 3 పాదాలు వారికి సంపత్తార అయింది అనుకున్నది. నెరవేరుతుంది ఆర్థిక పరిపుష్టిని పొందుతారు.

పరిహారం :- సూర్యనమస్కారాలు చేయండి. నాన వేసిన పెసలు బుధవారం నాడు బెల్లంతో ఆవుకు తినిపించండి. గురువారం నియమం గురు తత్వ విచారణ చేయండి.

వృచ్చిక రాశి :- ఈ రాశి వారికి ధన లాభం కుటుంబసభ్యుల ఆనందము సంతోషము మిమ్మల్ని చాలా చాలా ఉత్సాహంగా ముందుకు నడిపిస్తాయి. శత్రువు మూలంగా భయం మీకు ఉంటుంది కానీ మీ తెలివితేటలతో మీరు ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. రవి చంద్ర బలం మీకు చాలా తక్కువగా ఉంది. గురుడు మిమ్మల్ని ఒక కంట కనిపెడుతుంటాడు. అంటే మీ గురువు యొక్క దృష్టి మీ పైన ఉంది. వారి సాయంతో మీరు చక్కని కార్యాన్ని సమాజం కోసం చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇటు పైన కూడా సంపాదించుకుంటారు. తొమ్మిదవ ఇంట్లో కుజుడు మీకు శత్రువుని పెంచుతాడు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రతి పనిలో తొందరపాటు కూడదు. మీకు అలవాటు ఆ అలవాటు మార్చుకున్నట్లు అయితే చాలా చక్కగా మీకు లభిస్తుంది. మీ రాశికి గురువు శుక్రాచార్యుడు చక్కగా అనుకూలంగా ఉన్నారు. ఆర్థిక లావాదేవీలు పెరుగుతున్నాయి వ్యాపార వ్యవహారాలు మీకు ఒక మార్గం లభిస్తుంది ఉన్నతమైన గౌరవ మర్యాదలు కూడా లభించనున్నాయి చిన్న భయం వెంటాడుతూ ఉంటుంది. మీకు ఈ వారంలో 43% శుభఫలితాలు ఉంటాయి. విశాఖ 4వ పాదం వారికి సంపత్తార అయింది. ఆర్థిక అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు జన్మ తార అయింది ప్రతికూలత కొంచెం ఎక్కువగా ఉంది అనారోగ్య సూచన ఉంది. జ్యేష్టా నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది కాబట్టి చాలా పనులు నెరవేరుతాయి.

పరిహారం :- ఏకాదశి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి పూజ, సుబ్రహ్మణ్య పూజ చేయండి. వీలైతే సప్త సూక్త పారాయణ చేయిస్తే మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.

ధను రాశి :- ఈ రాశి వారికి ధన లాభం, కుటుంబసౌఖ్యం, ఆనందము, సుఖ జీవనం ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలే ఉన్నాయి. అయినా ఓర్వలేనితనంతో శత్రు పీడ మీకు తప్పదు. స్థానచలనం ఉంది కాబట్టి మీరు కొంచెం వ్యాపారం వ్యవహారం విషయాల్లో పెట్టుబడులను తగ్గించండి. భూ సంబంధమైన వ్యవహారాలు అయితే ఫలిస్తాయి. వాటిలో మీకు లాభం కూడా చేకూరుతుంది. వ్యవసాయం చేసిన పనికి వస్తుంది. లేదా భూములు కొన్న స్థలం మీకు మంచి జరుగుతుంది. శని ప్రభావం చేశా మీకు మీ కుటుంబ సభ్యులతో ఎవరికో ఒకరికి అనారోగ్య సూచన తో పాటు అధిక ధనవ్యయం సూచనలు కూడా ఉన్నాయి. మీకు సంబంధించిన వ్యక్తులు కాకుండా ఇతరులకు మేలు కొరకు ఖర్చుపెట్టి వలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీలో ఉన్న ఉదాసీనత తగ్గించండి. ఎవరో పని చేసి పెడతారులే అనే భావన మీలో చాలా బద్ధకాన్ని కలగజేస్తోంది. రెండవ ఇంట శని ప్రభావం మీపై ఎక్కువగా పడుతోంది. మీ పనులకు మీరే ఆటంకాలు కల్పించి ఉంటారు. మీ నిర్లక్ష్యం వల్ల మీ పనులలో చాలా నష్టపోతున్నారు అది గుర్తించండి. వారాంతాల్లో మీకు ధన లాభం ఉన్నది. ఈ వారంలో మీకు 43% శుభఫలితాలు ఉన్నాయి. మూలా నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది పనులన్ని చాలా చక్కగా ఇతరుల సహాయంతో నెరవేరుతాయి. పూర్వాషాడ నక్షత్ర జాతకులకు నైధనతార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి సాధన తార అయింది కాబట్టి అనుకున్న పనులు చక్కగా సాధించుకుంటారు.

పరిహారం :- శని స్తోత్ర పారాయణ, సంకష్టహర స్తోత్ర పారాయణ, హరే రామ నామ జపం మీకు చాలా అనుకూలిస్తాయి. గురువారం నియమం గురు స్తోత్ర పారాయణ చేయండి.

మకర రాశి :- ఈ రాశి వారికి ఆరోగ్యము సర్వ భోగాలు గొప్ప సంతోషాన్ని స్థాయి. మీరు విశేషంగా ఈ వారంలో ఒక మంచి ఫలితాన్ని పొందుతారు. రవి వారాంతాల్లో మారిన తర్వాత మీకు అనుకున్న పనులన్నీ నెరవేర్చు మొదలవుతాయి. గురుడు అనుకూలత లేకపోవడంవల్ల ప్రతి పనిని వాయిదా వేసుకుంటూ పోతారు. అది మీకు చాలా ధననష్టాన్ని సూచిస్తున్నది. ఇతరులతో వాదనలో ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అనారోగ్య విషయాల్లో కూడా ఉంది కాబట్టి పెద్దవారు చిన్న పిల్లలు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్లను కంట కనిపెట్టి వారికి సరైన భద్రత కల్పించడం చాలా అవసరం. ఎంత ధనం వస్తుందో అర్థం కూడా మీకు ఖర్చు అయిపోతుంది. మీరు గొప్ప విజయాన్ని సాధించి అందరి మెప్పును పొంది మంచి రోజులు వస్తున్నాయి. ఊహించనంత లాభాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు జాగ్రత్తగా వినియోగించుకోండి. ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి వాయిదా పడుతున్న పనులన్నీ కూడా ఈ వారంలో ప్రారంభమవుతాయి. అన్ని రాశుల కంటే ఎక్కువగా ఈ రాశి వారికి అనగా 50 శాతం శుభ ఫలితాలు ఈ వారం లో ఉన్నాయి. ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు వారికి సాధన తార అయింది పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది కాబట్టి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. ధనిష్ట 1 2 పాదాలు వారికి క్షేమ తార కాబట్టి విశేష ఫలితాంశాలు పొందగలుగుతున్నారు.

పరిహారం :- శని జపం చేయించండి హోమ ప్రక్రియ నిర్వర్తించండి. బ్రాహ్మణ భోజనాలు పెట్టండి శనివారం గురువారం ఉపవాస నియమం పాటించండి.

కుంభ రాశి :- ఈ రాశి వారు చంద్ర గురువులు అనుకూలం తో ధన లాభం ఉంది. ఈ వారంలో ఎన్నడు ఎదుర్కొని విపత్కర పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. సుమారుగా అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ప్రతి పని వాయిదా పడుతుంది. అవమానము అపజయము ఇవి మిమ్మల్ని వెన్నంటి చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. మీ కంటే చిన్నవాళ్లు మిమ్మల్ని అధిగమించి చాలా దూరం వెళ్లి పోతారు. మీరు వెనుకబడే పరిస్థితి ఏర్పడుతుంది. గ్రహ స్థితి వల్ల వాళ్ళంతా మీకు మోసము అన్యాయం చేసినట్లు అనిపిస్తుంది కానీ మీకు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని గ్రహించడానికి అట్టే సమయం పట్టదు. ఒకానొక సమయంలో అప్పుకూడా పుట్టినటువంటి పరిస్థితి. అందువల్ల అది కోపం గా మారి అనేక ఇబ్బందులకు దారి తీస్తుంది. ఇంటి నుండి దూరంగా ఉండాలని కోరిక కలుగుతుంది. ఈ వారంలో మీకు 22 శాతం మాత్రమే శుభఫలితాలు ఉన్నాయి. ధనిష్ట 3 4 పాదాలు వారికి క్షేమ తార అయింది కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. శతభిషా నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి పరిస్థితులు అనుకూలంగా లేవు. పూర్వాభాద్ర 1 2 3 పాదాలు వారికి సంపత్ తార అయింది కాబట్టి అనుకూలతలు చాలా బాగా ఉన్నాయి.

పరిహారం :- గ్రహ శాంతిని చేయించండి. రుద్రాభిషేకము సప్తశతి పారాయణ ఖడ్గమాల పారాయణ మీకు మనోధైర్యాన్ని ఆత్మ స్థైర్యాన్ని ఇస్తాయి.

మీన రాశి :- ఈ రాశి వారికి విశేష ధనసంపాదన ఇష్టకామ్యార్థ సిద్ధి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. అడుగడుగునా మీకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. రవి గ్రహస్థితి బాగాలేదు. చంద్రుడు కూడా మానసిక శారీరక దైర్యాన్ని పోగొట్టి అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు. మీలో ఆలోచనలు ఎప్పటికీ తగ్గక వాటి నుంచి పని సాధించలేక మీలో ఆసక్తి దుర్జనత్వం కలుగుతోంది. శ్రమకు తగ్గ ఫలితం లభించకపోవడం పైగా అపకీర్తి మిమ్మల్ని కుటుంబ పరిస్థితులు ఇబ్బందికి గురి చేస్తాయి. దీనికి కారణం లగ్నంలో కుజుడు ఉండడమే. మీ తోటి వారే మీ ముందే అనేక రకాల ఉన్నతిని సద్గతిని పొందుతూ ఉంటే చూసి మీరు మరింత వ్యాకులతకు గురి అవుతారు. గురు శుక్రుల పరిస్థితి బాగోలేదు గనుక కుటుంబంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇంట్లోనుంచి ప్రతికూలతలు ఎక్కువవుతాయి. మీ మాట కట్టుబాటు వల్ల మాత్రమే మీరు ఇవాళ విశేష స్థానాన్ని సంపాదించుకుని సర్వసౌఖ్యాలు పొందే ప్రయత్నం చేయగలరు. మీకు ఈ వారంలో 36 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. పూర్వాభాద్ర 4వ పాదం వారికి క్షేమ తార అయింది కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు జన్మతార అయింది ఆరోగ్యము అవమానము ఎక్కువ. రేవతి నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకూలంగా ఉంటుంది.

పరిహారం :- 13వ తేదీ మంగళవారం సుబ్రహ్మణ్య పూజ పూజ జపము ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ సమర్పణ హనుమాన్ చాలీసా పారాయణ మంచివి.

Next Story