తెలంగాణలో మరో 11 పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on 6 May 2020 8:50 PM IST
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నమోదైన కేసులన్ని జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. బుధవారం రాష్ట్రంలో కొత్తగా మరో 11 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 1107 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 29 మంది మరణించారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 648 మంది డిశ్చార్జి కాగా.. 430 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఇక గ్రీన్, ఆరెంజ్ జోన్లలలో కొన్ని సడలింపులు ఇచ్చారు.
Next Story