మే నెలలోనే పదో తరగతి పరీక్షలు: సీఎం కేసీఆర్‌

By సుభాష్  Published on  6 May 2020 4:12 AM GMT
మే నెలలోనే పదో తరగతి పరీక్షలు: సీఎం కేసీఆర్‌

తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 29 వరకు పొడిగిస్తున్నట్లు నిన్న రాత్రి సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇక కరోనా మహమ్మారి కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన పదో తరగతి పరీక్షలను మే నెలలోనే నిర్వహిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. మార్చిలో మూడు పరీక్షలు నిర్వహించిన తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు టెన్త్‌ పరీక్షలు వాయిదా పడ్డాయని, మిగితా పరీక్షలన్నీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. హైకోర్టు సూచించిన నిబంధనల ప్రకారమే మిగిలిన 8 పరీక్షలను నిర్వహిస్తామన్నారు.

గతంలో 2వేల500 పరీక్ష కేంద్రాలను ఉండేవని, అవసరమైతే 5వేల పరీక్ష కేంద్రాల వరకు పెంచుతామన్నారు. పరీక్షల సమయంలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. పరీక్ష గదులలో శైనిటైజర్లు, పరీక్ష హాల్లో తక్కువ విద్యార్థులు ఉండేలా చూస్తామన్నారు.

అలాగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కులు అందజేస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని తెలిపారు. విద్యార్థుల కోసం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటాం. విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి. పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లి మళ్లీ తీసుకొస్తాం. ధనవంతుల పిల్లలుంటే వాళ్లకు స్పెషల్‌ కారు పాసులు కూడా ఇస్తాం. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎస్‌ఎస్‌సీ పరీక్షలను మే నెలలోనే పూర్తి చేస్తాం. ఎందుకంటే ఎస్‌ఎస్‌సీ ఆధారంగానే ఇతర అడ్మిషన్స్‌, ఇంటర్మీడియట్‌ చదువు ఆధారపడి ఉంటుంది అని సీఎం పేర్కొన్నారు.

Next Story
Share it