పదో తరగతి పరీక్షలపై కరోనా ప్రభావం పడింది. తెలంగాణలో పదోతరగతి పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రేపు జరగాల్సిన టెన్త్‌ పరీక్ష యథాతధంగా నిర్వహించాలని సూచించింది. ఈనెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూల్‌ చేయాల హైకోర్టు ఆదేశించింది. ఈనెల 30 నుంచి ఏప్రిల్‌ 6 వరకు జరగాల్సిన పరీక్షలపై పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

గురువారం నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కరోనా వైరస్‌(కొవిడ్‌-19) వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 9వేల మందికి పైగా మృత్యువాత పడ్డారని.. మరో 2లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారని పిటిషనర్‌ తరుపు లాయర్‌ వాదించారు. ప్రస్తుతం దేశంలో కూడా కరోనా విజృంభిస్తున్న తరుణంలో పరీక్షలు నిర్వహించడం సమంజసం కాదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు చదువు పై శ్రద్ద వహించేలేరని.. వాయిదా వేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం.. సోమవారం నుంచి ఈ నెల 30 వరకు నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.